అన్నగారు నందమూరి తారక రామ రావు గారి గురించి అందరికి తెలిసిందే, ఆయన ప్రతిభ గురించి, పట్టుదల గురించి, వారి క్రమ శిక్షణ గురించి ఎన్నో విషయాలు విని ఉంటాం, అదే విధంగా ఆయన డబ్బు దగ్గర చాల ఖచ్చితంగా ఉంటారు అని, అయన చాల పొదుపరి అని, గిట్టని వారు( పిసినారి) అని ఇలా, చాల మంది తమ అనుభవాలు చెప్తుంటారు. అటువంటి ఒక సంఘటనే అడవి రాముడు షూటింగ్ జరుగుతున్న రోజుల్లో చోటు చేసుకొంది. అది చింతపల్లి అటవీ ప్రాంతం, మంచి చలి కాలం, అడవి రాముడు షూటింగ్ కోసం అక్కడకు వెళ్ళటం జరిగింది. ఆ చలిని తట్టుకునేందుకు అన్నగారు చాలానే ఇబ్బంది పడ్డారు, తనను చలి నుండి కాపాడగలిగిన ఏకైక ఆయుధం సిగెరెట్ అని డిసైడ్ అయిన యెన్.టి.ఆర్.
తెచ్చుకున్న రెండు సిగరెట్ పెట్టెలు ఊది పడేసారు, కానీ షూటింగ్ పూర్తి కాలేదు, దానికి తగినట్లు చలి పెరుగుతూ ఉండటం తో, బాయ్ ని పిలిచి సిగెరెట్ పెట్టె తెమ్మని పది రూపాయలు ఇచ్చి పంపించారట, అప్పట్లో గోల్డ్ ఫ్లేక్ కింగ్ సైజు 8 రూపాయల 75 పైసలు. సిగెరెట్ పెట్టె తెచ్చిన బాయ్, అన్నగారి రూమ్ లో పెట్టి తన పనిలో పడిపోయాడు. షూటింగ్ కి ప్యాక్ అప్ చెప్పిన తరువాత రూమ్ కి వచ్చిన అన్నగారు, టేబుల్ పైన ఉన్న సిగెరెట్ పెట్టె చూసారు కానీ, మిగిలిన చిల్లర లేదు. వెంటనే అన్నగారు మేనేజర్ ని పిలిచి బాయ్ ని పిలవమని గద్దించారు. ఏం తప్పు జరిగిందో అని అందరు వణికి పోయారు, భయపడుతూ అక్కడకు వచ్చిన బాయ్ ని , మిగతా చిల్లర ఎక్కడ బ్రదర్? అని అడిగారట..
దానితో ఖంగారు పడిన బాయ్, జేబులో చిల్లర తీసి అక్కడ పెట్టి సారీ చెప్పి వెళ్ళిపోయాడట, అందరు ఊపిరి పీల్చుకున్నారు. ఆ తరువాత ” చిల్లర నాకు పెద్ద విషయం కాదు, కానీ డబ్బు విలువ ముఖ్యం. మన దగ్గర పని చేసే వారికీ కూడా డబ్బు విలువ తెలియాలి అందుకే ఆలా చేశాను అని చెప్పారట. డబ్బు విలువ తెలిసిన వారు కాబట్టే, తాను సి.ఏం. అయిన తరువాత ఒక్క రూపాయి జీతం తీసుకొనే వారు, ప్రజా ధనం వృధాగా సొంత ఖర్చులకు, పటాటోపాలకు, ప్రచారానికి వాడేందుకు ఒప్పుకొనేవారు కాదు. తాను సి.ఏం. గ ఉన్న రోజుల్లో పాత అంబాసిడర్ కారునే రిపేరు చేసి వాడారు అనవసరం అయిన ఆడంబరాలకు పోలేదు.