in

crazy update on Prabhas and Hanu Raghavapudi’s film!

సీతారామమ్‌ వంటి బ్లాక్‌ బ్లస్టర్‌ తర్వాత హను రాఘవపూడి దర్శకత్వంలో వహిస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. యుద్ధం నేపథ్యంలో యాక్షన్‌ డ్రామాగా ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను ప్లాన్‌ చేస్తున్నారు మేకర్స్‌. మైత్రీ మూవీ మేకర్స్‌ ఈ సినిమాను ఇండియాలోనే కాకుండా ఇతర దేశాల్లోని భాషల్లో కూడా విడుదల చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికరమైన న్యూస్‌ బయటకు వచ్చింది.

ఈ సినిమా తొలి షెడ్యూల్‌ వచ్చే సోమవారం నుంచి ప్రారంభంకానున్నట్లు తెలుస్తోంది. తమిళనాడులోని కారైకుడిలో షూటింగ్‌ మొదలు కానుందని సమాచారం. కీలక సన్నివేశాలను తమిళనాడులోని కారైకుడి ప్యాలెస్‌లో చిత్రీకరించబోతున్నారని టాక్‌. ఈ షెడ్యూల్‌ మొత్తం ప్రభాస్‌కు సంబంధించిన సన్నివేశాలు ఉంటాయని తెలుస్తోంది. ఇక ఇది పూర్తికాగానే హైదరాబాద్‌లో సెకండ్ షెడ్యూల్ ఉండనుందని సమాచారం. ఇందుకోసం చిత్ర యూనిట్ భారీ బడ్జెట్‌తో ప్రత్యేక సెట్ కూడా వేస్తోందని తెలుస్తోంది..!!

kerala beauty Samyuktha in for Bellamkonda’s Next!

Regina Cassandra opens up about dating!