in

confirmed: Sukumar to start ‘Pushpa 3’ after Ram Charan’s flick

పుష్ప తర్వాత పుష్ప 2 ప్రారంభించిన సుకుమార్, ఆ సినిమా పూర్తయిన వెంటనే పుష్ప 3 మొదలుపెడతారని అందరూ ఆశించారు. కానీ, సుకుమార్ ఇప్పుడు తన దృష్టిని మరొక ప్రాజెక్ట్‌పై కేంద్రీకరించారు. ఆయన ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో కలిసి సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ కొత్త సినిమా కోసం ఆయన ఇప్పటికే స్క్రిప్ట్ తయారీలో నిమగ్నమై ఉన్నారు. ఈ సినిమా గురించి స్వయంగా నిర్మాతలు అధికారికంగా కన్ఫాం చేయడం విశేషం..

ప్రస్తుతం రామ్ చరణ్, సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు దర్శకత్వంలో పెద్ది అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాకు మైత్రి మూవీ మేకర్స్ సంస్థే డబ్బులు పెడుతోంది. పెద్ది సినిమా మార్చి, 2026లో విడుదల కానుంది. ఈ సినిమా షూటింగ్ పూర్తవగానే, రామ్ చరణ్, సుకుమార్ కలిసి చేయబోయే కొత్త సినిమాను ప్రారంభించనున్నారు. సుకుమార్-రామ్ చరణ్ సినిమాకు కూడా మైత్రి మూవీ మేకర్స్‌ వారే భారీ బడ్జెట్‌తో పెట్టుబడి పెడుతున్నట్లు ఆ సంస్థ నిర్మాతలు ఖచ్చితమైన హామీ ఇచ్చారు..!!

sreeleela interesting comments about her marriage!

Balakrishna Collaborates with Nayanthara 4th time!