తెలుగు చిత్ర పరిశ్రమలో కమెడియన్స్ కి ఎప్పుడు అగ్ర తాంబూలమే దక్కింది. అటువంటి కమెడియన్లకు రాజ యోగం పట్టించింది మాత్రం రాజ బాబు గారే, రోజుకు మూడు షిఫ్టులు పని చేస్తూ 13 సంవత్సరాలు తెలుగు చిత్ర సీమలో హాస్య నట చక్రవర్తి గ వెలిగారు రాజ బాబు గారు. రాజ బాబు గారు రెమ్యూనరేషన్ కోసం ఎవరిని పీడించక పోయిన, తన స్థాయి ని తగ్గించుకొని నంటించమంటే మాత్రం నటించే వారు కాదు. యెన్.టి.ఆ.ర్ హీరో గ నటిస్తున్న ఒక చిత్రంలో రాజ బాబు గారిని కూడా తీసుకున్న నిర్మాత గారు, రాజ బాబు తో ఈ పిక్చర్ లో, యెన్.టి.ఆర్. ఎన్ని గెట్ అప్ లు వేస్తారో మీరు అన్ని గెట్ అప్ లు వేస్తారు అని చెప్పారట.
ఓ అలాగా! మరైతే నా రెమ్యూనరేషన్ ఎంత? అన్నారట రాజ బాబు, మీకు ఎప్పుడు ఇచ్చేదే గ అన్నారట, అలాగయితే కుదరదు, యెన్.టి.ఆర్. కి ఎంత ఇస్తారో అంత నాకు కూడా ఇవ్వాలి అన్నారట. అదేమిటండి మీరు కమెడియన్ అయన హీరో అన్నారట నిర్మాత, మరయితే నా వేషం కూడా ఆయనతోనే వేయించండి అన్నారట. దెబ్బకు దిగి వచ్చిన ఆ నిర్మాత యెన్.టి.ఆర్. కి ఇచ్చినంత రెమ్యూనరేషన్ ఇచ్చి , రాజ బాబు గారిని ఆ చిత్రం కోసం బుక్ చేసుకున్నారట. అది రాజ బాబు గారి లౌక్యం. అది లౌక్యం కాదు, అహం ఎంత మాత్రం కాదు, ఆత్మ గౌరవం అంటారు రాజ బాబు గారు.