నవరస నటసార్వభౌముడు సత్యనారాయణ కమెడియన్ గ అందరిని ఆశ్చర్యపరిచిన చిత్రం” దేవుడు చేసిన మనుషులు”. ఈ చిత్రంలో విజయనిర్మల అన్నయ్య గ తాగుబోతు క్యారెక్టర్ లో తన ఇమేజీకి భిన్నంగా కామెడీ పండించిన సత్యనారాయణ. ఈ క్యారెక్టర్ కి ముందుగా నాగభూషణం గారిని అనుకున్నారు, ఆయన డేట్స్ కుదరకపోవడం తో కృష్ణ గారు సత్యనారాయణ గారిని పిలిచి ఈ క్యారెక్టర్ గురించి చెప్పారు, మొదట్లో సత్యనారాయణ కొంచెం వెనుకాడినా నటుడు అన్నవాడు అన్ని తరహా పాత్రలు చేసి మెప్పించాలి అనుకోని ఆ పాత్ర కు ప్రాణం పోశారు.
యెన్.టి.ఆర్., ఎస్.వీ.ఆర్. కృష్ణ వంటి నటులందరి మధ్య తన కామెడీ రోల్ ను అత్యంత సమర్ధవంతం గ చేసి మంచి మార్కులు కొట్టేసారు. సినిమా రిలీజ్ తరువాత ఎస్.వీ.ఆర్. సత్యనారాయణను పిలిచి చాల బాగా చేసావు, నీ నటన ముందు మేమంతా తేలిపోయాము అంటూ ప్రశంసించారు. ఈ సినిమా తరువాత సత్యనారాయణ గారు విలన్ క్యారెక్టర్లకు మాత్రమే పరిమితం కాకుండా విభిన్నమయిన క్యారెక్టర్ లు చేస్తూ నవరస నటసార్వభౌముడు అనిపించుకున్నారు.