బోస్ ఇస్ బాస్ ” ఈ స్లోగన్ ఎక్కడో చూసినట్లుంది కాదు, ఎస్ తప్పకుండ చూసి ఉంటారు. అంతా కొత్త తారాగణం తో దాసరి గారు నిర్మించిన” స్వర్గం నరకం ” సినిమా లో మోహన్ బాబు ప్లేస్ లో హీరో కావలసిన బోసు బాబు, ట్రాన్స్పోర్టర్ అయ్యారు. విజయవాడ లక్ష్మి ఫిలిమ్స్ అనే ఫిలిం డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లో రెప్రెసెంటేటివ్ గ పని చేస్తున్న బోస్ బాబు ను చుసిన దాసరి గారు తన సినిమా లో అవకాశం ఇస్తానని చెప్పారు, అప్పటికే అసిస్టెంట్ డైరెక్టర్ గ పని చేస్తున్న భక్తవత్సలం నాయుడు కి కూడా అవకాశం ఇచ్చారు.
వీరిద్దరికి మేక్ అప్ టెస్ట్ చేసి, ఒక సీన్ చేయించారు, అదృష్టం భక్తవత్సలం నాయుడు ని వరించింది, కట్ చేస్తే మోహన్ బాబు గ సినీ రంగం లో స్థిరపడ్డారు. బోస్ బాబు మాత్రం ఇది మన లైన్ కాదు అనుకున్నారో ఏమో, ఆ తరువాతి కాలం లో ఎస్.వి.ఆర్.టూర్స్ అండ్ ట్రావెల్స్ స్థాపించి ఆంధ్ర ప్రదేశ్ జనానికి షిర్డీ కి దారి చూపించారు, ఆ షిర్డీ సాయి బోస్ బాబు కి దారి చూపించాడు. ట్రావెల్స్ రంగం లో తిరుగులేని ట్రాన్స్పోర్టర్ గ ఎదిగిన బోస్ ఆ రంగం లో బాస్ అయ్యారు, మోహన్ బాబు కలెక్షన్ కింగ్ అయ్యారు. సుభాష్ చంద్రబోస్ ” బోస్ ఇస్ బాస్” అయ్యారు, భక్తవత్సలం నాయుడు” కలెక్షన్ కింగ్ “అయ్యారు, కృషి ఉంటె మనుషులు ఋషులు అవుతారు అనటానికి నిదర్శనం వీరిద్దరి జీవితం.