చంద్ర బాబు నాయుడు ముఖ్య మంత్రి హోదాలో స్వయంగా వచ్చి బ్రహ్మానందం గారిని రాజకీయాలలోకి ఆహ్వానించినా అటు వైపు మొగ్గు చూపని దూర దృష్టి కలిగిన నటుడు బ్రహ్మానందం గారు. 1996 లో అన్నపూర్ణ స్టూడియో లో అదిరింది అల్లుడు సినిమా షూటింగ్ జరుగుతుంది సెట్ లో మోహన్ బాబు గారు, కోట గారు, బాబు మోహన్ గారు ఉన్నారు, వారందరు అప్పటికే రాజకీయాలలో ఉన్నారు. హఠాత్తుగా సి.ఎం. గారి కాన్వాయ్ స్టూడియో లో ప్రేవేసించింది, చంద్ర బాబు గారు సెట్ కి వచ్చారు, అక్కడ ఉన్న అందరిని పలుకరించి, బ్రహ్మానందం గారితో ఆంతరంగికం గ సమావేశం అయి,
ఆయనను తెలుగు దేశం పార్టీ లోకి ఆహ్వానించారు, తనకు కొంత టైం ఇవ్వమని అడిగారు బ్రహ్మ్మనందం గారు. అప్పటికే రాజకీయాలలో ఉన్న తన సహా నటుల అనుభవాలు,అప్పటికి పీక్ లో ఉన్న కెరీర్, తన రాజకీయ ప్రవేశం వలన జరుగబోయే పరిణామాలు బేరీజు వేసుకున్న మన మాస్టారు బ్రహ్మానందం గారు,కొద్దీ రోజులు మౌనం వహించి, తన రాజకీయ ప్రవేశాన్ని తప్పించుకున్నారు.తన రాజకీయ ప్రవేశం కంటే, తనకు కెరీర్ ముఖ్యం అనుకున్నారేమో, అందుకేనేమో పొట్టి వాళ్ళు గట్టి వాళ్ళు అంటారు మన పెద్దలు.