డైరెక్టర్ సుకుమార్ గారు, రొటీన్ కి భిన్నం గ తాను తీసే ప్రతి సినిమా ఒక ఇంటలెక్చవల్ పాయింట్ ని బేస్ చేసుకొని చేసారు, అందులో కొన్ని జనానికి అర్ధం అయ్యాయి కొన్ని అర్ధం కాలేదు. జనానికి బాగా అర్ధం అయ్యేట్లు చేసిన సినిమా ఒక్క రంగస్థలం సినిమా . అసలు సుకుమార్ గారు డైరెక్టర్ అవ్వాలని ఎప్పుడు అనుకొన్నారు, ఆయనకు స్ఫూర్తి ఎవరు? అదేమిటో గాని గోదావరి నీటిలో ఉందొ లేక ఆ మట్టి లో ఉందొ ఆ ప్రభావం తెలియదు కానీ గోదావరి జిల్లాల వారికీ సినిమా పట్ల ఉన్న మక్కువ ఒకింత ఎక్కువే అని చెప్పాలి. సుకుమార్ గారు కూడా రాజోలు కి దగ్గరలోని మట్టపర్రు అనే గ్రామం లో జన్మించారు, రాజోలు జెట్.పి. హై స్కూల్ లో చదువుకున్నారు. ఆయన స్కూల్ చదువుతున్న రోజుల్లో డైరెక్టర్ వంశి గారు వీరి స్కూల్ ఎదురుగా కనకమహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్ అనే సినిమా షూటింగ్ చేసారు.
రోజు స్కూల్ కి వెళుతూ వస్తూ, వంశి గారు అందరిని కమాండ్ చేయటం, ఆర్టిస్టులు అందరు ఆయనకు ఇస్తున్న గౌరవం చూసి, సినిమా కి బాస్ డైరెక్టర్ కాబట్టి నేను కూడా వంశి గారి లాగా డైరెక్టర్ అవ్వాలి అనుకున్నారట ఆ చిరు ప్రాయం లో.వంశి గారిని చూడటం కోసం ఆయన బస చేసిన ఇంటి గోడ దగ్గరకు వెళ్లి యెగిరి,యెగిరి ఆయనను చూసే వారట. ఆ తరువాత కాకినాడ లో కాలేజీ చదువు, ఆ తరువాత లెక్చరర్ గ ట్యూషన్స్ చెప్పటం, అయినా ఎక్కడో తన డెస్టినీ ఇది కాదు అనుకునే వారట. చివరకు సినీ పరిశ్రమలో ప్రవేశించి వినాయక్ గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గ పని చేసారు, ఆర్య తో డైరెక్టర్ గ మారారు.ఈ రోజు తెలుగు సినీ పరిశ్రమలో లో ఒక మంచి డైరెక్టర్ గ గుర్తింపు సాధించారు..