
పవన్ కళ్యాణ్, రాశి కాంబినేషన్ లో వచ్చిన గోకులంలో సీత చిత్రం ఒక మెమొరబుల్ హిట్. ఆ చిత్రంలో రాశి అద్భుతంగా నటించింది. ముత్యాల సుబ్బయ్య ఈ చిత్రానికి దర్శకుడు. ఈ చిత్రంలో తనని హీరోయిన్ గా ఎంపిక చేసింది చిరంజీవి సతీమణి సురేఖగారే అని రాశి తెలిపింది.గోకులంలో సీత చిత్ర ప్రారంభానికి ముందు చిరంజీవిగారి ఇంటి నుంచి పిలుపు వచ్చింది.చిరంజీవిగారు పిలుస్తున్నారేమో అని అనుకుని నా ఆల్బమ్ తీసుకుని మా నాన్నతో వెళ్లాను. కానీ నన్ను పిలిచింది సురేఖ గారు. ఈ అమ్మాయి కళ్యాణ్ బాబు పక్కన గోకులంలో సీత చిత్రంలో చక్కగా సరిపోతుంది. ఫైనల్ చేసేయండి అని చిరంజీవిగారికే చెప్పింది. అలా తనకు గోకులంలో సీత చిత్రంలో నటించే అవకాశం వచ్చిందని రాశి తెలిపింది.

