
సెలబ్రెటీలు ఎక్కడైనా చిన్న పొరపాటు చేస్తే చాలు సోషల్ మీడియాలో ఆడేసుకుంటారు నెటిజన్లు. చిన్న పెద్ద తేడాలేకుండా విపరీతంగా ట్రోల్స్ చేస్తుంటారు. సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్ ను చాలా మంది పట్టించుకోరు. కొంతమంది మాత్రం వాళ్లపై వచ్చే ట్రోల్స్ మితి మీరితే ఘాటుగానే రియాక్ట్ అవుతుంటారు. తాజాగా సోషల్ మీడియాలో వస్తున్న ట్రోల్స్ పై చిరంజీవి స్పందించారు. ఇటీవల సోషల్ మీడియాలోకి అడుగు పెట్టిన చిరంజీవి చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో చిరుకు కూడ కొన్ని ట్రోలింగ్స్ ఎదురవుతున్నాయి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చిరు మాట్లాడుతూ .. ‘ఎవరి గురించైనా తప్పుగా మాట్లాడితే వాళ్ల నీచత్వమే బయటపడుతుంది. అది వాళ్ల క్యారెక్టర్. వాళ్ల తప్పుడు రాతలతో నన్ను బాధించలేరు. నా అనుమతి లేకుండా నన్ను ఎవ్వరూ బాధించలేరు . `ట్రోల్ చేసుకునే వారిని చేసుకోనివ్వండి వాళ్ళ కామెంట్లు చదివి నేను టైం వెస్ట్ చేసుకోను .’అంటూ సమాధానం ఇచ్చారు ‘మెగాస్టార్.
					
					
