తెలుగు చలన చిత్ర పరిశ్రమ కు చెందిన అతిరధ, మహారథుల వంటి వారికీ తృటిలో తప్పిన ప్రమాదం. బహుశా ఇప్పటి తరం వారికీ ఈ విషయం చాల తక్కువమందికి తెలిసి ఉండవచ్చు. అది 1993 అప్పటికి తెలుగు చిత్ర పరిశ్రమ పూర్తి గ హైదరాబాద్ లో స్థిరపడలేదు, ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణులు అప్పటి మద్రాస్ నుంచి వచ్చి హైదరాబాద్ లో షూటింగ్ లో పాల్గొని తిరిగి వెళుతుండేవారు. 1993 నవంబర్ 15 ఉదయం ఇండియన్ ఎయిర్ లైన్స్ కి చెందిన ఎయిర్ బస్ ఏ-300 మద్రాస్ ఎయిర్పోర్ట్ నుండి హైదరాబాద్ కు బయలుదేరింది. ఆ ఫ్లైట్ లో తెలుగు సినీ రంగానికి చెందిన వారితో కలిపి 247 మనది ప్రయాణికులు ఉన్నారు.
సినీ రంగానికి చెందిన చిరంజీవి, బాలకృష్ణ, విజయశాంతి, అల్లు రామలింగయ్య, కోడి రామకృష్ణ, ఎస్. వి. కృష్ణ రెడ్డి వంటి ప్రముఖులు అందరు ఆ విమానం లో ఉన్నారు. ఇంకొక గంటలో హైదేరాబద్ లో దిగవలసిన విమానం లో సాంకేతిక లోపం తలెత్తటం తో విమానం ఆకాశం లోనే చక్కర్లు కొట్టింది. విమాన కెప్టెన్ భల్ల, ఏమాత్రం తొణక కుండా విమానాన్ని తిరుపతి కి దగ్గర్లోని పంట పొలాల్లో ఎమర్జెన్సీ లాండింగ్ చేసారు. 247 మంది ప్రయాణికులు సిరక్షితంగా బయటకు వచ్చారు. ఏదైనా జరిగి ఉంటె, తెలుగు సినీ చరిత్రలోనే అది ఒక పెద్ద దుర్ఘటనగా మిగిలి ఉండేది.తమ ప్రాణాలను కాపాడిన కెప్టేన్ భల్ల ను ఘనంగా సత్కరించారు, మన సినీ ప్రముఖులు అందరు కలసి.