in

chiranjeevi rickshaw nu dhati doosukonipoina naryana murthy rickshaw !

చిరంజీవి గారి రిక్షా ను దాటి బాక్స్ ఆఫీస్ వైపు దూసుకొని పోయిన నారాయణ మూర్తి రిక్షా. సినీ పరిశ్రమలో పోటీ తత్త్వం చాల కామన్, కానీ అది హెల్ది గ ఉన్నప్పుడే అందరికి ఆనందం, ఆ పోటీకి ఒక అర్ధం ఉంటుంది. క్రాంతి కుమార్ నిర్మాతగా, కోడి రామకృష్ణ డైరెక్షన్ లో చిరంజీవి గారు నటించిన చిత్రం “రిక్షావోడు”, పూర్తి మాస్ క్యారెక్టర్ కావటం తో చిరంజీవి అభిమానులు పండగ చేసుకున్నారు. ఈ చిత్రం మొదలయిన రెండు నెలల తరువాత దాసరి గారు నిర్మాతగా,డైరెక్టర్ గ, నారాయణ మూర్తి హీరోగా ప్రారంభం అయిన చిత్రం ” ఒరేయ్ రిక్షా”, నారాయణ మూర్తి ఇమేజ్ తగ్గట్టుగానే ఆ సినిమా లో అయన పాత్రను మలిచారు దాసరి, ఈ చిత్రంలో ఎనిమిది పాటలు ఉంటె అందులో ఆరు పాటలు ప్రజా గాయకుడూ గద్దర్ వ్రాయటం విశేషం. “రిక్షావోడు” చిత్రం లో చిరంజీవి గారు తండ్రి , కొడుకులు గ ,డ్యూయల్ రోల్ చేసారు.

సినిమా రిలీజ్ అయిన తరువాత చిరంజీవి గారి నటనకు మంచి పేరు వచ్చింది కానీ, ఓవరాల్ గ పిక్చర్ అనుకున్నంత విజయం సాధించలేదు. ” ఒరేయ్ రిక్షా” చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకొని పోయింది, చిరంజీవి గారి రిక్షా వెనకబడింది. ఒరేయ్ రిక్షా చిత్రం ఏకంగా 175 డేస్ రన్ తో అందరిని ఆశ్చర్య పరచింది. ఆ చిత్ర 100 డేస్ సెలెబ్రేషన్ లో చీఫ్ గెస్ట్ గ పాలుగొన్న చిరంజీవి గారు, మా రెండు రిక్షా ల పోటీలో నారాయణ మూర్తి రిక్షా దూకుకొని పోయింది, నా రిక్షా వెనుక బడింది అంటూ వ్యాఖ్యానించారు. అంటే చిరంజీవి గారు తన చిత్ర అపజయాన్ని ఎంత స్పోర్టివ్ గ తీసుకున్నారో చూడండి, ఇటువంటి వాతావరణం మరిన్ని మంచి చిత్రాలు రావటానికి దోహదం చేస్తుంది అనేది నిర్వివాదాంశం. చిత్ర పరిశ్రమలో పోటీ అవసరం కానీ అది ఆరోగ్యవంతం గ ఉండాలి.

adah sharma latest stills in red saree!

Kajal Aggarwal slams at trolls on her body-shaming!