
చిరంజీవి కథానాయకుడిగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘మన శంకర వరప్రసాద్‌గారు’ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అయితే, చిరంజీవి మోకాలి నొప్పితో బాధపడుతున్నారని, అందుకే ఆయనకు సర్జరీ జరిగిందని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాతలు సాహు గారపాటి, సుస్మిత కొణిదెల మీడియా సమావేశంలో ఈ వదంతులను కొట్టిపారేశారు.
నిర్మాత సాహు గారపాటి మాట్లాడుతూ.. “చిరంజీవికి సర్జరీ జరిగిందన్న వార్తలు పూర్తిగా అబద్ధం. ఆయన ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్నారు. బుధవారం జరిగే ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు వెంకటేశ్‌తో కలిసి హాజరవుతారు. ప్రమోషన్లు, ఇంటర్వ్యూలలో కూడా పాల్గొంటారు” అని తెలిపారు. చిరంజీవి ఫిట్‌నెస్ గురించి చెబుతూ, “ఆయన గతంలో కంటే ఇప్పుడు మరింత ఫిట్‌గా ఉన్నారు. అందుకే తెరపై స్పెషల్ లుక్‌లో కనిపిస్తారు. అవుట్‌డోర్ షూటింగ్‌లో కూడా రెండు పూటలా జిమ్ చేసేవారు” అని వివరించారు..!!