
మెగా స్టార్ చిరంజీవి గారు, మొట్ట మొదటి సారిగా ముఖానికి రంగు ఎప్పుడు వేసుకున్నారో మీకు తెలుసా, మొగల్తూరు లో వారు టెన్త్ క్లాస్ చదువుతున్నపుడు, వారి క్లాసుమేట్, ఇప్పటి ప్రముఖ డాక్టర్, సత్య ప్రసాద్ గారు వ్రాసిన” పరధ్యానం పరంధామయ్య “అనే నాటకం కోసం చిరంజీవి గారు మొదటి సారిగా ముఖానికి రంగు వేసుకున్నారు.ఇంకొక విషయం ఏమిటంటే ఎవరో వేయవలసిన క్యారెక్టర్ చిరంజీవి గారు వేయ టం,ఇటువంటి అనుభవం చిరంజీవి గారి విషయం లో రెండు సార్లు జరిగింది, ఒకటి ఈ పరధ్యానం పరంధామయ్య నాటకం లో మెయిన్ క్యారెక్టర్ వేయవలసిన ఆచారి అనే స్టూడెంట్ టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ భయం వలన పారిపోవటం వలన, ముఖ్య పాత్ర ధరించే అవకాశం శివ శంకర వరప్రసాద్ కు దక్కింది,అదే విధం గ పునాదిరాళ్ళు అనే చిత్రం లో ముందు గ సెలెక్ట్ అయిన సుధాకర్ గారు, ఆ టైం లోనే అతనికి భారతీరాజా గారి చిత్రం లో హీరో అవకాశం రావటం తో, పునాదిరాళ్ళు చిత్రం లో నటించే అవకాశం చిరంజీవి గారికి దక్కింది. విధి ఎంత బలీయమైనదో చూడండి, పెద్దలు ఒక సామెత చెపుతుంటారు, అదృష్టవంతడిని ఎవరు చెడగొట్టలేరు, దురదృష్టవంతుడిని ఎవరు బాగు చేయలేరు అని, అది చిరంజీవి గారి విషయం లో అక్షరాలా నిజం అయ్యింది. అదృష్టం అవకాశం మాత్రమే ఇస్తుంది,దానికి దీక్ష పట్టుదల తోడైతే ఒక మెగా స్టార్ అవుతాడు అని చిరంజీవి గారి జీవితం చూస్తే ఎవరికయినా అవగతం అవుతుంది.అదృష్టం కొద్దీ వచ్చిన అవకాశం చూసుకొని పొంగిపోయి, ఆ తరువాత కుంగిపోయిన వారు ఎంతమందో మనం ప్రత్యేకించి చెప్పవలసిన అవసరం లేదు. అదృష్టం+ స్వయంకృషి +క్రమశిక్షణ = విజయం, అందుకు నిలువెత్తు నిదర్శనం చిరంజీవి గారు.

