టాలీవుడ్ లో అలనాటి కమెడియన్ బాబు మోహన్ గురించి చెప్పనవసరం లేదు. పిట్ట కొంచెం కూత ఘనం అన్నట్టుగా.. చిన్న వయసులోనే ఎన్నో పాత్రలు వేసి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు నటుడు బాబు మోహ న్ఇక ఈయన కోట శ్రీనివాసరావుతో కలిసి కామెడీ చేస్తే.. కడుపుబ్బా నవ్వని మనిషంటూ ఉండరు. 1952 మార్చి 19న బీరోలు, తిరుమలాయపాలెం మండలం, ఖమ్మం జిల్లా లో జన్మించారు. బాబు మోహన్ కామిడి టైమింగ్ చాలా బాగుంటుంది.
మామగారు సినిమాలో చేసిన యాచకుడి పాత్ర హాస్యనటుడిగా మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ తరువాత వచ్చిన మాయలోడు, రాజేంద్రుడు గజేంద్రుడు, పెదరాయుడు, జంబలకిడి పంబ లాంటి సినిమాలలో మంచి హాస్య పాత్రలు ధరించాడు. తెలుగులో కామిడియన్ గా, హీరో గా, సహాయ పాత్రల్లో నటించి మంచి మార్కులు వేయించుకున్నారు బాబు మోహన్. బాబు మోహన్ ఖమ్మం లో రెవెన్యూ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తూనే కుటుంబాన్ని పోషించేవాడు.. నటన మీద ఆసక్తితో చిన్నప్పుడే ఎన్నో నాటకాలు వేసి, తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు.
ఇక ఈయన నటన పై ఉన్న ఇంట్రెస్ట్ తో జాబ్ కూడా వదిలేసి..ఖాళీగా సారథి స్టూడియో చుట్టూ తిరుగుతూ ఉండేవాడట. ఈ క్రమంలోనే అక్కడ ఒక స్టార్ హీరో సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు..అక్కడే కూర్చున్న ఒక నటుడి ని ఇలా అదిగారట..” ఈ సినిమాలో హీరో ఎవరు” అని అడిగితే.. ఇక ఎదురుగా ఉన్న ఆయన నవ్వి.. ఆ హీరో ఎవరో కాదు నేనే అని చెప్పాడు. ఇమతకి ఆ హీరో ఎవరో తెలుసా..?? చిరంజీవి. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి. అప్పుడు షాక్ అయిన బాబు మోహన్.. సారీ సార్ నన్ను క్షమించండి అంటూ అక్కడ నుండి వెళ్ళిపోయారట.