పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో రాబోతున్న ‘స్పిరిట్’ సినిమాపై ఓ క్రేజీ న్యూస్ ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రంలో ఓ అత్యంత కీలకమైన పాత్ర కోసం మెగాస్టార్ చిరంజీవిని రంగంలోకి దించాలని సందీప్ వంగా గట్టిగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఈ వార్త బయటకు రావడంతో సినిమాపై అంచనాలు ఒక్కసారిగా రెట్టింపయ్యాయి.
ఇటీవల బ్లాక్‌బస్టర్ విజయం సాధించిన ‘యానిమల్’ చిత్రంలో అనిల్ కపూర్ పోషించిన పాత్ర సినిమాకు ఎంత బలంగా నిలిచిందో తెలిసిందే. అదే తరహాలో ‘స్పిరిట్’లో కూడా ఓ పవర్‌ఫుల్ నటుడు ఉంటే సినిమా స్థాయి మరింత పెరుగుతుందని సందీప్ భావిస్తున్నారట. ఈ పాత్రకు మెగాస్టార్ అయితేనే పూర్తి న్యాయం జరుగుతుందని ఆయన నమ్ముతున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఈ కాంబినేషన్ కుదిరితే, బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు..!!