మెగా బ్రదర్ నాగ బాబు అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్ లో నిర్మించిన చిత్రం ” ముగ్గురు మొనగాళ్లు” ఈ చిత్రంలో మెగాస్టార్ త్రిపాత్రాభినయం చేసారు. సహజం గ ఫైట్ సీన్స్ లో డూప్ లను వాడుతుంటారు, ప్రమాదకరమయిన దృశ్యాలు చిత్రీకరిస్తున్నపుడు ట్రైనెడ్ డూప్స్ ని ఉపయోగిస్తుంటారు. కానీ ఈ చిత్రం లో ఒక సీన్ లో మూడు పాత్రలు డైనింగ్ టేబుల్ దగ్గర కలుసుకుంటాయి. ఆ సీన్ చిత్రీకరణలో చిరంజీవి లాగా కనిపిస్తున్న మరో ఇద్దరు కావలసి వచ్చింది.
అప్పుడు ఒక పాత్ర కి డూప్ గ నటుడు ప్రసాద్ బాబు నటిస్తే, మరొక పాత్రకు డూప్ గ చిరంజీవి గారి, అప్పటి పి.ఏ. అయిన సుబ్బా రావు గారు నటించారు. ప్రసాద్ బాబు , సుబ్బా రావు పర్సనాలిటీ చిరంజీవి గారికి సరిపోయినట్లు అంటాయి, అందుకే వారిని ఈ చిత్రం లో చిరంజీవి గారికి డూప్ లుగా వాడుకోవటం జరిగింది. హీరోలకు సహా నటులు డూప్ లుగా నటించటం కొత్హేమీ కాదు, దీనికి ముందు యెన్.టి.ఆర్. గారికి డూప్ గ కైకాల సత్యనారాయణ నటించారు, హీరో నాగార్జున కు డూప్ గ హీరో శ్రీకాంత్ నటించారు.