అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించనున్న తాజా చిత్రం గురించి గత కొన్ని రోజులుగా వార్తలు వినబడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చిరంజీవి తన తాజా చిత్రంపై అధికారిక ప్రకటన చేశారు. హైదరాబాద్‌లో నిన్న జరిగిన లైలా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చిరంజీవి తన కొత్త సినిమా గురించి క్లారిటీ ఇచ్చారు..
అనిల్ రావిపూడి దర్శకత్వంలో తన తాజా చిత్రం వేసవిలో ప్రారంభమవుతుందని తెలిపారు. ఇది పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రమని వెల్లడించారు. ఆ సినిమా సెట్స్‌లో అడుగుపెట్టేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని అన్నారు. అనిల్ సన్నివేశాల గురించి చెబుతుంటే కడుపుబ్బా నవ్వుకున్నానని తెలిపారు. దర్శకుడు కోదండరామిరెడ్డితో పనిచేసిన సమయంలో ఎలాంటి అనుభూతి కలిగిందో, ఇప్పుడు అనిల్‌తో అలాంటి అనుభూతే కలుగుతోందని గుర్తు చేసుకున్నారు. సాహు గారపాటి, సుస్మిత (చిరంజీవి కుమార్తె) సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తారని చిరంజీవి తెలిపారు..!!