in

Chhaava!

Synopsis:

ఛావా 2025లో విడుదలైన హిందీ చారిత్రక యాక్షన్ సినిమా. శివాజీ సావంత్ రాసిన మరాఠీ నవల ఛావా ఆధారంగా మరాఠా సామ్రాజ్యం రెండవ పాలకుడు శంభాజీ కథాంశంతో నిర్మించిన సినిమా, క్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించగా మాడాక్ ఫిల్మ్స్ బ్యానర్‌పై దినేష్ విజన్ నిర్మించిన ఈ సినిమాను ఫిబ్రవరి 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశారు..

CAST:  విక్కీ కౌశల్, రష్మిక మందన్న, అక్షయ్ ఖన్నా, అశుతోష్ రానా, దివ్య దత్తా, డయానా పెంటి తదితరులు..

TELUGU SWAG RATING: [usr 3]

Top Reviewers:

TELUGU 360 (Rating: 3/5):

కొన్ని సినిమాలు థియేటర్ గేట్ దాకా గుర్తుంటాయి, కొన్ని సినిమాలు ఇంటికొచ్చేదాకా గుర్తుంటాయి. “ఛావా” (Chhaava) కొన్ని నెలలపాటు కళ్లల్లో మెదిలే సినిమా. విక్కీ కౌశల్ నట విశ్వరూపం, లక్ష్మణ్ ఉటేకర్ టేకింగ్, రెహమాన్ సంగీతం, యాక్షన్ కొరియోగ్రఫీ, మేకప్ వర్క్ వంటి అన్నీ అంశాలు మనసులో మెదులుతూ, మరోసారి థియేటర్లో చూడాలి అని పరితపించేలా చేస్తాయి. బాలీవుడ్ లో విక్కీ కౌశల్ హవా ఈ సినిమాతో మొదలవ్వడం ఖాయం.

Telugu Film Nagar (Rating:3/5):

నటుడిగా విక్కీ కౌశల్ సింహగర్జనకు ప్రతిరూపం ‘ఛావా’. పొటెన్షియల్ ఉన్న కథ, క్యారెక్టర్ దొరికితే ఎంతటి పవర్‌ఫుల్ పెర్ఫార్మన్స్ ఇవ్వగలను అనేది నటనతో చెప్పారు. శంభాజీ వీరోచిత గాథను తెరపై ఆవిష్కరించడంలో దర్శకుడు సక్సెస్ కావడానికి విక్కీ కౌశల్ నటన ప్రధాన కారణం. తర్వాత ఏఆర్ రెహమాన్ మ్యూజిక్. థియేటర్లలో ప్రేక్షకులకు యాక్షన్ సీన్లు చూస్తున్నంతసేపు గూస్ బంప్స్ వస్తాయి. జై భవానీ, హరహర మహాదేవ్ డైలాగులు విక్కీ కౌశల్ నోట వచ్చినప్పుడు దేశ భక్తులకు పూనకాలే. సాధారణ ప్రేక్షకులకు సైతం మంచి సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ ఇస్తుందీ సినిమా.

Mirchi9 (Rating: 3.25/5):

హిస్టరీ లో జరిగిన విషయాలను చాలా వరకు ఆడియన్స్ కి నచ్చేలా తీయడంలో డైరెక్టర్ సఫలం అవ్వగా..సినిమాలో ఆడియన్స్ కి గూస్ బంప్స్ తెప్పించే సీన్స్ చాలా ఉండగా…మోడతో సింహంతో పోరాట సన్నివేశ..తర్వాత యాక్షన్ ఎపిసోడ్ లు..ఇక క్లైమాక్స్ పోర్షన్ మొత్తం..కొంచం ఆడియన్స్ కి ఇబ్బంది పెట్టేలా ఉన్నా కూడా ఆడియన్స్ కి రోమాలు నిక్కబోర్చుకోవడం ఖాయమని చెప్పాలి..ఆల్ రెడీ హిందీ లో చూసిన వాళ్ళు మరోసారి తెలుగులో చూడొచ్చు..తెలుగులోనే చూడాలి అనుకున్న వాళ్ళని సినిమా మరింత ఆకట్టుకోవడం ఖాయం..ఓవరాల్ గా రీసెంట్ టైములో వచ్చిన వన్ ఆఫ్ ది బెస్ట్ హిస్టారికల్ మూవీస్ లో ఈ సినిమా ఒకటి అని చెప్పొచ్చు..

123TELUGU (Rating: 3/5):

మొత్తంగా చూస్తే, ‘ఛావా’ చిత్రం ఓ హిస్టారికల్ యాక్షన్ డ్రామాగా ఆకట్టుకుంటుంది. విక్కీ కౌశల్ అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఈ సినిమాకు బలంగా నిలిచింది. కానీ, కొన్ని సాగదీత సీన్లు, లెంగ్తీగా అనిపించే నెరేషన్ సినిమాకు మైనస్‌గా నిలిచాయి. ఛత్రపతి శివాజీ మహారాజ్, శంభాజీ మహారాజ్‌ల వీరత్వాన్ని మరోసారి చూడాలని అనుకునేవారికి ఈ సినిమా కనెక్ట్ అవుతుంది. కామన్ ఆడియన్స్ కూడా ఈ సినిమాను ఈ వీకెండ్‌లో ట్రై చేయవచ్చు..

Times Of India (Rating: 3.25/5):

ఛావా చిత్రం ఓవరాల్‌గా దేశభక్తిని చాటిచెప్పే ఎమోషనల్ వార్ డ్రామా. ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు, డైలాగ్ పార్ట్ అత్యున్నత అంశాలుగా మారాయి. అలాగే మరాఠా యోధులు స్వరాజ్య స్థాపన కోసం ఎలాంటి త్యాగాలకు ఒడిగట్టారనే విషయాన్ని చాలా భావోద్వేగంగా చెప్పారు. చరిత్రను తెలుసుకొనే వారు, అలాగే మొఘల్ పాలనలో అరాచకాలను గ్రహించాలనుకొంటే ఈ సినిమాను తప్పకుండా చూడాలి. వికీ కౌశల్, రష్మిక మందన్న తమ నటనతో ఈ సినిమాను మరో రేంజ్‌కు తీసుకెళ్లారు. ఈ సినిమాను థియేటర్‌లోనే చూస్తే మంచి అనుభూతి కలుగుతుంది. డొంట్ మిస్ ఇట్..

rukmini vasanth is the perfect replacement for sai pallavi!

Australian cricketer David Warner’s cameo in nithin’s ‘Robinhood’!