మూడు రోజుల క్రితం సూపర్ స్టార్ రజనీకాంత్ ఇంటికి బాంబు బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చిన సంగతి తెల్సిందే. దీంతో చెన్నైలోని సినీ, రాజకీయ వర్గాలు ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. పోయిస్ గార్డెన్స్‌లోని రజనీ ఇంట్లో బాంబు పెట్టామని, అది ఏ క్షణాన్నైనా పేలుతుందని ఓ గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి చెప్పాడు. దీంతో వెంటనే అలర్ట్ అయిన పోలీస్ యంత్రాంగం రజనీ ఇంటికి చేరుకొని అణువణునా గాలించారు.
బాంబ్ స్వ్కాడ్, డాగ్ స్క్వాడ్‌తో రజనీ ఇంటితో పాటు చుట్టుపక్కల పరిసరాల్లో గాలింపు చేపట్టారు. అయితే ఎంత వెతికినా బాంబ్ దొరకలేదు. దీంతో అది ఫేక్ కాల్ అని చెన్నై పోలీసులు తెలిపారు. ఫోన్‌కాల్ ఎవరు చేశారన్నది గుర్తించామని పోలీసులు తెలిపారు. కడలూర్ జిల్లా దగ్గర్లోని నెల్లికుప్పంకు చెందిన ఎనిమిదో తరగతి విద్యార్ధి ఈ పని చేసినట్లు గుర్తించారు. పోలీసు విచారణలో అతని మెడికల్ స్టేట్‌మెంట్స్ పరిశీలించి ఈ బాలుడు మానసిక స్థితి సరిగా లేదని భావించి వదిలిపెట్టారు..