
[qodef_dropcaps type=”square” color=”#ffffff” background_color=””]అ[/qodef_dropcaps] ర్జున్ రెడ్డి స్టార్ విజయ్ దేవరకొండ పేరుతో ఓ వ్యక్తి సోషల్ మీడియా లో మోసాలు చేస్తున్నాడు. విజయ్ ఫేక్ అకౌంట్ ఒకటి సృష్టించి అమ్మాయిలకు వల వేశాడు. విజయ్‌ను కలవాలంటే ఈ నెంబరుకి కాల్ చేయండి అంటూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు చేశాడు. విజయ్ లేడీ ఫాన్స్ తనని కలవడానికి ఆ వ్యక్తితో ఛాటింగ్ చేశారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో తన పేరు మీద వైరల్ అవుతున్న నెంబరును విజయ్ దేవరకొండ గుర్తించారు. ఆ అజ్ఞాత వ్యక్తి ఎవరో తెలుసుకోవాలని విజయ్ మేనేజర్ అమ్మాయి పేరుతో ఛాటింగ్ చేశారు. ఇలా చాలా మంది అమ్మాయిల్ని ట్రాప్ చేస్తున్నట్లు తెలుసుకున్నారు. వాట్సాప్ ఛాటింగ్ ఆధారాలతో విజయ్ అనుచరులు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.