బుల్లి తెరపై అనసూయకు తిరుగులేదు. ఆ క్రేజ్ తో సినిమాల్లోనూ ఆఫర్లు అందుకుంది. ముందు చిన్నా చితకా సినిమాలు చేసినా, రంగస్థలంలో రంగమ్మత్త పాత్ర తనకు మంచి మైలేజీ ఇచ్చింది. అనసూయని ఇలాక్కూడా వాడుకోవచ్చని ఆ సినిమాతో సుకుమార్ నిరూపించాడు. మొత్తానికి సినిమాల్లోనూ తనకు అద్భుతమైన బ్రేక్ తగిలింది. ఆ తరవాత కొన్ని అవకాశాలు వచ్చినా, అనసూయ ఆచి తూచి ఎంచుకుంది. పారితోషికమూ పెంచేసింది. కాకపోతే, ఇప్పుడు తాను చేస్తున్న సినిమాలు తనకు మైనస్ గా మారుతున్నాయి.
అది కచ్చితంగా అనసూయ కెరీర్‌పై ప్రభావం చూపించే అంశమే..పుష్ప లో అనసూయ నటించిన సంగతి తెలిసిందే. రంగస్థలం తరవాత సుకుమార్ కాంబినేషన్‌లో చేసిన సినిమా కావడంతో, ఇందులో అనసూయ పాత్రని ఓ రేంజ్‌లో ఊహించుకున్నారు సినీ జనాలు. దక్షాయణిగా లెంగ్త్ ఉన్న పాత్రనే ఇచ్చాడు సుకుమార్. కానీ… ఆ సినిమాలో అనసూయ గెటప్ వికృతంగా కనిపించింది. ఆపాత్ర కూడా పేలిందేం లేదు. వయసు ముదిరిన వాటం తెరపై స్పష్టంగా కనిపించింది. ఇప్పుడు `ఖిలాడి`లోనూ అనసూయ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో తను రెండు గెటప్పుల్లో దర్శనమిచ్చింది.
ఫస్టాఫ్‌లో హోమ్లీగా కనిపించి, సెకండాఫ్‌లో… అల్ట్రా మోడ్రన్ అవతారం ఎత్తింది. అయితే ఈరెండు గెటప్పులూ అనసూయకు సూటు కాలేదు. తన నటన కూడా మరీ ఓవర్ యాక్షన్ ని తలపించింది. అనసూయ ఉంటే చాలు… జనం చూసేస్తారు.. అనుకునే రోజులు కావివి. ఆపాత్ర గ్లామరెస్ గా లేకపోయినా, కొత్తగా కనిపించకపోయినా ప్రేక్షకులు తిరస్కరించడం ఖాయం. పుష్ప, ఖిలాడి విషయాల్లో ఇదే జరిగింది. స్టార్ హీరోలు, దర్శకుల సినిమాలు కదా అని అనసూయ కక్కుర్తి పడితే ఇలాంటి ఎదురు దెబ్బలు తగలడం ఖాయం. ఈ విషయంలో అనసూయ జాగ్రత్తగా ఉండాల్సిందే.