in

character artist shivaji turns villain?

శివాజీ కారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరియర్ ప్రారంభించి, తరవాత సెకండ్ హీరోగా, చిన్న చితకా వేషాలు వేస్తూ ఒక్కో మెట్టు ఎక్కుతూ హీరో స్థాయికి ఎదిగి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. హీరోగా శివాజీ చేసిన మిస్సమ్మ, అదిరందయ్యా చంద్రం, అమ్మాయికోసం, లాంటి సినిమాలు తనకి పేరు తెచ్చిపెట్టాయి. హీరోగా బానే సక్సెస్ అయిన టైమ్ లోనే సడెన్ గా పొలిటికల్ వైపు వెళ్ళాడు. ఆపరేషన్ గరుడ అంటూ ఫేమస్ అయ్యాడు. మళ్ళీ కనుమరుగైపోయాడు. రీసెంట్ గా బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 లో మెరిసి అందర్నీ ఆశ్చర్య పరిచాడు.

చాలా రోజుల తరవాత  బిగ్ బాస్ లో కనిపించినా మంచి ఆదరణే దక్కి టాప్ త్రీ లో నిలిచాడు  శివాజీ.  బిగ్ బాస్ తరవాత శివాజీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసాడు. #90 మిడిల్ క్లాస్ వెబ్ సిరీస్ తో మళ్ళీ అలరించాడు. ఈ మధ్య ఒక ఇంటర్వ్యూ లో సినిమాల్లో రీఎంట్రీ ఇస్తానని ,  విలన్ గా నటించాలని ఉందని తన కోరికను బయట పెట్టాడు. శివాజీ కోరికను  బోయపాటి శ్రీను తీర్చనున్నాడని టాక్. బాలకృష్ణ, బోయపాటి కాంబో మూవీలో విలన్ గా శివాజీ నటిచనున్నాడని సమాచారం. ఈ విషయాన్ని శివాజీ స్వయంగా చెప్పాడు..!!

Prasanth Varma to kick start Jai Hanuman!

sreeleela career in danger zone?