in

Change of heroine in Chiranjeevi’s next for ravi teja!

కాంబినేషన్ వింతగా అనిపించినప్పటికీ ఇది నిజం. చిరంజీవి-రవితేజ కాంబోలో రాబోతున్న ప్రాజెక్టులోకి ఇప్పుడు కొత్తగా క్యాథరీన్ త్రెసా వచ్చి చేరింది. మంచి క్రేజ్ కోసం ఎదురుచూస్తున్న ఈ ముద్దుగుమ్మకు నిజంగా ఇది చాలా పెద్ద అవకాశం. ఈ మూవీ క్లిక్ అయితే క్యాథరీన్ దశ తిరిగినట్టే. బాబి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు చిరంజీవి. ఇందులో హీరోయిన్ గా శృతిహాసన్ ను తీసుకున్నారు. ఓ కీలక పాత్ర కోసం రవితేజను తీసుకున్నారు. అతడికి హీరోయిన్ గా ఇప్పుడు క్యాథరీన్ ను తీసుకున్నారు. గ్లామర్ తో పాటు యాక్టింగ్ టాలెంట్ కూడా ఉండడంతో, క్యాథరీన్ ను ఈ అవకాశం ఈజీగా వరించింది.

నిజానికి ఈ ప్రాజెక్టులో రవితేజ సరసన నివేత పెతురాజ్ పేరు మొన్నటివరకు వినిపించింది. కానీ ఆఖరి నిమిషంలో ఆమె స్థానంలో క్యాథరీన్ వచ్చినట్టు తెలుస్తోంది. త్వరలోనే ఈ మేటర్ పై మైత్రీ మూవీ మేకర్స్ నుంచి అఫీషియల్ స్టేట్ మెంట్ రాబోతోందట. ఇద్దరమ్మాయిలతో, సరైనోడు, నేనే రాజు నేనే మంత్రి లాంటి సినిమాల్లో నటించింది క్యాథరీన్. ఆ తర్వాత ఆమెకు పెద్దగా పేరు రాలేదు. ప్రస్తుతం ‘బింబిసార’, ‘భళా తందనాన’, ‘మాచర్ల నియోజకవర్గం’ సినిమాల్లో నటిస్తోంది. చిరంజీవి సినిమాలో అవకాశం, క్యాథరీన్ కెరీర్ కు కలిసొచ్చేలా ఉంది.

Alia Bhatt unfollowed SS Rajamouli, deleted RRR posts on Instagram?

samantha Insisted her friend Anirudh for vijay d’s movie?