
సీనియర్ యాక్టర్ చంద్రమోహన్ గారు 1966 లో రంగుల రాట్నం అనే చిత్రం ద్వారా తెలుగు వెండి తెరకు పరిచయం అయ్యారు, మొదటి సినిమా తోనే ఆయన బెస్ట్ యాక్టర్ గ నంది అవార్డు అందుకున్నారు. ఆయన తో కలసి యాక్ట్ చేసిన చైల్డ్ ఆర్టిస్ట్ లు కూడా ఆయన ప్రక్కన హీరోయిన్స్ గ నటించారు. వారే కాదు తెలుగు లో ఏ కొత్త హీరోయిన్ వచ్చిన ఫస్ట్ హీరో చంద్రమోహన్ గారే,” గేట్ వే అఫ్ హీరోయిన్స్ “అని పేరు ఉండేది ఆయనకు. వారికీ ఒక చిత్రమయిన అలవాటు ఉండేది, సెట్ లో ఉన్న నటీనటులు, ఇతరులు ఎవరయినా ఏమరుపాటు గ ఉన్నప్పుడు చెవి మీద కొట్టటం, ఆయన సెట్ లో ఉంటె అందరు అలెర్ట్ గ ఉండేవారట ఎక్కడ చెవి కందిపోయేట్లు కొడతారో అని. ఒక సారి షూటింగ్ స్పాట్ కి హాస్య నటుడు ఆలీ కుమార్తె వచ్చిందట, చంద్రమోహన్ గారు సెట్ లో ఉన్న ఇంకొక అబ్బాయి ని చెవి కంది పోయేట్లు కొట్టారట, పనిలో పని ఆలీ కుమార్తెను కూడా కొట్టాలని చూశారట అది గమనించిన ఆ గడుగ్గాయి, ఒక పెద్ద రాయి చేతిలో తీసుకొని ఏది ఇప్పుడు కొట్టండి అని సవాలు చేసిందట, దెబ్బతో చంద్రమోహన్ గారు భిత్థర పోయి, అప్పటినుంచి ఆ అలవాటు మానేశారట.

