అవకాశాలు లేకపోవడంతో ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ సోషల్ మీడియా వేదికగా అభిమానులను సందడి చేస్తున్న ఈమెకు బాలీవుడ్ ఇండస్ట్రీలో అవకాశం వచ్చింది ఇలా బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ హీరోగా పూజ హెగ్డే హీరోయిన్గా నటించిన చిత్రం దేవ ఈ సినిమా జనవరి 31వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. ఇక ఈ సినిమా త్వరలోనే విడుదల కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా నిర్వహించారు..ఇదిలా ఉండగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి అయ్యాయని తెలుస్తుంది..
అయితే సెన్సార్ బోర్డు ఈ సినిమాకు గట్టి షాక్ ఇచ్చిందని చెప్పాలి. ఇందులో పెద్ద ఎత్తున లిప్ లాక్ సన్నివేశాలు ఉన్న నేపథ్యంలో సెన్సార్ ఇలాంటి సన్నివేశాలను కట్ చేసినట్టు తెలుస్తోంది. ఈ సినిమా భారీ రొమాంటిక్ బోల్డ్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది. ఈ సినిమాలో హీరో హీరోయిన్ల మధ్య లిప్ లాక్ సన్నివేశాలతో పాటు విపరీతమైన రొమాంటిక్ సన్నివేశాలు కాస్త అభ్యంతరకర పదాలు కూడా ఉన్న నేపథ్యంలో సెన్సార్ అలాంటి కొన్ని సన్నివేశాలకు కట్ చెప్పింది..!!