నటుడు మోహన్ బాబుపై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. తమను మోహన్ బాబు అవమానించారని తెలంగాణ రాష్ట్ర గొర్రెలు, మేకల పెంపకం సంఘం నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు మోహన్ బాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా సంఘం నేతలు మాట్లాడుతూ.. మోహన్ బాబును వెంటనే అదుపులోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా మీడియా ముందు క్షమాపణలు చెప్పాలని,
లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరించారు. ‘మా’ ఎన్నికలు పూర్తయిన తర్వాత మోహన్ బాబు మీడియా పలుమార్లు మాట్లాడారు. ఇటీవల ఒక కార్యక్రమానికి హాజరైన మోహన్ బాబు ఇండస్ట్రీలో జరిగిన గొడవలు గురించి మాట్లాడారు. ‘ఇష్టం వచ్చినట్లు గొడవ పడితే అది చూడటానికి అస్సలు బాగోదు. ఈరోజుల్లో గొర్రెలు కాచుకునే వారి దగ్గర కూడా ఫోన్ ఉంది.. వాడు కూడా మన బాగోతం చూస్తున్నాడు’ అంటూ మోహన్ బాబు కామెంట్ చేశారు. ఇప్పుడు ఇదే వివాదాస్పదమైంది. గొర్రెల కాపరి వృత్తిని అవమానించేలా మాట్లాడాడు అంటూ మోహన్ బాబుపై గొర్రెలు, మేకల పెంపకం సంఘం నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.