తెలుగులో కృతి సనన్ ఎప్పుడో సుపరిచితురాలు. సూపర్ స్టార్ మహేష్ బాబుతో ‘వన్ నేనొక్కడినే’ సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమైంది కృతి సనన్. అయితే, తొలి సినిమానే ప్లాప్ ఇచ్చింది. సెకండ్ సినిమాగా ‘దోచేయ్’లో నటించింది. కానీ, అది కూడా ఫెయిల్యూరే. ఇక ముచ్చటగా మూడో సినిమాగా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది ప్రబాస్‌తో ‘ఆది పురుష్’ సినిమాలో. అస్సలు వర్కవుట్ కాలేదు రీ ఎంట్రీలోనూ కాదు పొమ్మన్నారు కృతి సనన్‌ని. అలా కృతి సనన్‌కి తెలుగులో మూడూ ఫ్లాప్ సినిమాలే. ఇక, ఇప్పుడు చెల్లెలి వంతు.
కృతి సనన్ చెల్లెలు నుపుర్ సనన్ ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమాతో ఎంట్రీ ఇస్తోంది. తొలి సినిమాకే మాస్ రాజా రవితేజ వంటి స్టార్ హీరోనే పట్టింది. కానీ, అదృష్టం పట్టుకోవాలిగా. ఒకవేళ అదృష్టం వరిస్తే మాత్రం అమ్మడు టాలీవుడ్‌లో వెనక్కి తిరిగి చూసుకోనక్కర్లేదు. ‘టైగర్ నాగేశ్వరరావు’తో పాటూ,, నుపుర్ సనన్ తాజాగా ‘కన్నప్ప’ సినిమాకి కమిట్ అయ్యింది. మంచు మోహన్‌బాబు, విష్ణు కలిసి నటిస్తున్న సినిమా ఇది. పాన్ ఇండియా ప్రాజెక్టగా రూపొందుతోంది. దీంతో పాటూ మరో సినిమాలోనూ నుపుర్ సనన్ ఎంపికైందట. చూడాలి మరి, నుపుర్ కెరీర్ టాలీవుడ్‌లో ఎలా వుండబోతోందో..!!