
[qodef_dropcaps type=”square” color=”#ffffff” background_color=””]స్టై[/qodef_dropcaps] లిష్ స్టార్ అల్లు అర్జున్ ఇంక త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన మూడో సినిమా ‘అల వైకుంఠపురంలో’ అల బాక్స్ ఆఫీస్ ని షేక్ చేయడమే కాకుండా మరెన్నో రికార్డ్స్ ని సాధించింది.. తాజాగా ఈ సినిమా మరొక అరుదైన రికార్డు సాధించడం విశేషం, అదేంటంటే.. గత 24 ఇయర్స్ నుండి హైదరాబాద్ లోని సంధ్య 35MM థియేటర్ లో ‘పెళ్లి సందడి’ సినిమా పేరిట ఉన్న రికార్డు ని ‘అల వైకుంఠపురంలో’ చెరిపేసింది.. ‘పెళ్లి సందడి’ సంధ్య థియేటర్ లో 232 రోజులు ఆడి 98 లక్షలు వసూలు చేయగా, బన్నీ సినిమా అక్కడ కేవలం 29 రోజుల్లో 1 కోటి రూపాయలు వసూలు చేసింది. దింతో అక్కడ ఇన్ని రోజులు శ్రీకాంత్ సినిమా పేరిట ఉన్న రికార్డు ఇప్పుడు బన్నీ సినిమా రికార్డు గ మారింది..