డైరెక్టర్ వి.యెన్.ఆదిత్య సినీ రంగం లో ప్రవేశించిన కొత్తలో ఒక ఇండ్ల బ్రోకర్ మాటలు నమ్మి ఒక వ్యభిచార గృహం లో రూమ్ అద్దెకు తీసుకొని, చివరకు పేవ్మెంట్ మీద నిద్రపోవలసి వచ్చింది. భైరవ ద్వీపం సినిమాకు సింగీతం గారి వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గ పని చేసే అవకాశం వచ్చిన ఆదిత్య గారు రూమ్ కోసం వెతుకుతున్నపుడు ఒక బ్రోకర్ వాహిని స్టూడియో వెనుక వీధిలోని ఒక పెద్ద ఇంట్లో రూమ్ ఉందని రెండు వందలు కమిషన్ తీసుకొని , రూమ్ ఇప్పించాడు, స్టూడియో కి దగ్గరలో రూమ్ దొరికినందుకు చాల సంతోషించి, రూమ్ అంత నీట్ గ సర్దుకొని, రాత్రి భోజనం చేసుకొని హ్యాపీ గ సెకండ్ షో సినిమా చూసి రూమ్ చేరుకున్న ఆదిత్య, ఆ ఇంటి ముందు జనం గుమికూడి ఉండటం పోలీస్ జీప్ వచ్చి ఉండటం చూసి, ఒకింత ఆశ్చర్యానికి గురి అయ్యారు, అక్కడ ఉన్న జనం లో ఒకరిని అడిగితే ఇక్కడ వ్యభిచారం నడుస్తుంది అందుకే పోలీస్ ని పిలిచి ఖాళీ చేపిస్తున్నాము అని చెప్పారట.
ఆదిత్య కు చెమటలు పట్టాయి, మెల్లగా ఇన్స్పెక్టర్ దగ్గరకు వెళ్లి తన పరిస్థితి ఇంగ్లీష్ లో చెప్పారట, ఆయన వెంటనే రూమ్ లోకి వచ్చి చూసి, అక్కడ ఆదిత్య గారు సర్దుకున్న దేవుడి ఫోటోలు, పుస్తకాలు చూసి పెద్దగా నవ్వటం మొదలు పెట్టాడట, భలే వాడివయ్యా అద్దెకు దిగటానికి ఇంతకంటే మంచి ప్లేస్ దొరకలేదా నీకు, వెంటనే ఇక్కడనుంచి ఖాళీ చేసి వెళ్లిపో లేదంటే నిన్ను కూడా జీప్ ఎక్కించవల్సివుంటుంది అన్నారట. అంతే వెంటనే తన సామాను సర్దుకొని రోడ్డున పడ్డ ఆదిత్య అక్కడ ఉన్న ఒక హోటల్ వారిని అడిగేతే వారు కొత్తవారిని అనుమతించము అని చెప్పారట, ఇక చేసేది ఏమి లేక అక్కడే కునికిపాట్లు పడుతున్న ఆదిత్య గారి మీదకు ఒక హిందూ పేపర్ విసిరాడట ఒక అతను, ఆ పేపర్ పరుచుకొని రాత్రి పేవ్మెంట్ మీద నిద్ర పోవలసి వచ్చింది ఆదిత్య గారు. సినిమా వాళ్ళు తెర మీద చూపించే కష్టాల కంటే ఎక్కువ కష్టాలు పడవలసి వస్తుంది సినిమాలలో పనిచేయటానికి వెళ్లిన వారికీ. దానికి ఒక ఉదాహరణ ఆదిత్య గారి అనుభవం..