బ్రహ్మ్మనందం స్టార్ కమెడియన్ అఫ్ తెలుగు ఫిలిమ్స్, నటన తప్ప వేరే విషయం లో ఎప్పుడు వేలు పెట్టని బ్రహ్మానందం గారు, ఒక పాటకు కొరియోగ్రఫర్ గ మారారు. మనీ చిత్రం లో ఖాన్ దాదా క్యారెక్టర్ ఎంత పాపులర్ అయిందో మనందరికీ తెలుసు. అందులో” వారే వాహ్ ఏమి ఫెసు, అచ్చు హీరోల ఉంది బాసు” పాట చిత్రీకరణ సందర్భంగా, శివ, సుబ్రహ్మణ్యం డాన్స్ మాస్టర్స్ స్టెప్స్ కంపోజ్ చేసారు, అందులో చాలామంది నటులు నటిస్తుండటం తో, స్టెప్స్ సింక్ అవటం లేదు టేకుల మీద టేకులు తింటున్నారు, అప్పుడు బ్రహ్మ్మనందం గారు అసిస్టెంట్ డైరెక్టర్ శివనాగేశ్వర్ రావు తో, డాన్స్ మాస్టర్స్ ని పంపించేయండి అని చెప్పారట. అయన వారితో రేపు తీసుకుందాం మాస్టర్, ఈ రోజు కొన్ని యాక్షన్ సీన్స్ తీసుకుంటాము అని పంపించివేశారట.
వాళ్ళు వెళ్ళిపోయాక, మాస్టర్స్ చెప్పిన మూవ్మెంట్స్ నేను చేసి, అది మిగతా నటుల డాన్స్ తో సింక్ అవ్వాలంటే పది రోజులు పడుతుంది, నా బాడీ లాంగ్వేజ్ కి తగిన మూవ్మెంట్స్ నేను చేస్తాను, మిగతా వాళ్ళను కూడా అలాగే చేయమనండి అని చెప్పారట. అంతే మరుసటి రోజు సాంగ్ వేయగానే బ్రహ్మ్మనందం గారు చిరంజీవి గారిని ఇమిటేట్ చేస్తూ డాన్స్ చెయ్యటం మొదలెట్టారు, ఒక వైపు జ్ జె.డి., మరోవైపు తనికెళ్ళ భరణి ,వెనక ఉన్న మిగతా ఆర్టిస్ట్ లు వాళ్ళ స్టైల్ లో వాళ్ళు డాన్స్ చేయటం మొదలెట్టారట, డాన్స్ లో సింక్ లేకపోయినా చాల నాచురల్ గ అనిపించి అలాగే షూట్ చేసారు. ఆ పాట ఏ రేంజ్ లో హిట్ అయిందో మనందరికీ తెలుసు. ఆ తరువాత గత ముప్పై ఏళ్ళు గ బ్రహ్మానందం గారు, తాను ఎప్పుడు డాన్స్ చేసిన అదే స్టెప్ కంటిన్యూ చేస్తూ వస్తున్నారు మనం చూస్తూనే ఉన్నాం. సో కొన్ని, కొన్ని సందర్భాలు ఆలా వాటంతట అవే సెట్ అవుతాయి అన్నమాట.