అఖండ మూవీ తో భారీ హిట్ అందుకున్న యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను..సూర్య అభిమానుల్లో ఆనందం నింపారు. సూర్య తో ఖచ్చితంగా ఓ యాక్షన్ సినిమా చేయబోతున్నట్లు తెలిపారు. ఆకాశమే నీ హద్దురా, జై భీమ్ వంటి వరుస విజయాలతో ఫుల్ జోష్ లో ఉన్న సూర్య..మార్చి 10 న ‘ఈటీ ‘మూవీ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తెలుగు, తమిళ్ భాషల్లో ఒకేసారి రిలీజ్ కాబోతున్న ఈ చిత్రాన్ని పాండిరాజ్ డైరెక్ట్ చేయగా..సన్ పిక్చర్ బ్యానర్లో కళానిది మారన్ భారీ బడ్జెట్తో నిర్మించారు. మాస్ అండ్ యాక్షన్ డ్రామా గా తెరకెక్కిన ఈ మూవీ లో సూర్య కు జోడిగా ప్రియాంక అరుళ్ మోహన్ నటించింది.
చిత్ర ప్రమోషన్ లో భాగంగా గురువారం ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను హైదరాబాద్ లో అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హీరో రానా దగ్గుబాటి, అగ్ర నిర్మాత సురేశ్ బాబు, దర్శకులు బోయపాటి శ్రీను, గోపీచంద్ మలినేని పాల్గొన్నారు. ఈ సందర్భంగా బోయపాటి మాట్లాడుతూ.. ’సూర్య, నేనూ కలిసి తప్పకుండా ఓ సినిమా చేస్తాము. ఈ మూవీ ఎప్పుడు అనేది మాత్రం ఇప్పుడే చెప్పలేను కానీ మా కాంబినేషన్లో ఖచ్చితంగా ఓ సినిమా ఉంటుంది అని అన్నారు. ఇక అదే సమయంలో తెలుగు ప్రేక్షకులు సూర్యను తమిళ హీరోగా కాకుండా తమలో ఒకరిగా చూస్తున్నారని చెప్పుకొచ్చారు. బోయపాటి వ్యాఖ్యలతో అభిమానులు సంతోషం వ్యక్తం చేసారు