బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను రూపొందించిన అఖండ సినిమా ఏ స్థాయిలో విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దీనికి సీక్వెల్‌గా అఖండ2 రాబోతోంది. ఈ సినిమా షూటింగ్ కూడా ఇటీవల మొదలైంది. కుంభమేళాలో ఈ సినిమాకు సంబంధించిన కొన్ని షాట్స్ చిత్రీకరించారు. షూటింగ్‌కు సంబంధించి బోయపాటి శ్రీను కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. మహాకుంభ మేళాలో ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయి.
దాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. షూట్ కోసం మేము ఇక్కడికి వచ్చాం. మాది అఘోరా నేపథ్యంలో సాగే కథ. సినిమాలోని కొన్ని సన్నివేశాలను ఇక్కడ చిత్రీకరించేందుకు వచ్చాం. జనవరి 11 నుంచి ఇక్కడే ఉన్నాం. జనవరి 16తో షూటింగ్ పూర్తయిందన్నారు. నాగ సాధువులు, అఘోరాలను కలిశాం. మా ప్రయత్నలోపం లేకుండా చిత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దేందుకు అన్ని విధాలా శ్రమిస్తున్నాం అని చెప్పారు..