బుర్ర సాయి మాధవ్, పొట్టి వాడయినా గట్టివాడు అని నిరూపించుకున్న సినీ రచయిత. అటువంటి మంచి రచయిత బాంబు బ్లాస్ట్ నుంచి తృటిలో తప్పించుకున్నారు, దాదాపుగా గ క్రిష్ గారి అన్ని సినిమాలకు సాయి మాధవ్ గారె రైటర్. ఈ మధ్య కాలం లో నిర్మితమయిన “మహానటి” “యెన్.టి.ఆర్.కధానాయకుడు”, “సైరా నరసింహ రెడ్డి” వంటి బయో పిక్స్ కి సాయి మాధవ్ గారే డైలోగ్స్ రాసారు. 2015 లో క్రిష్ గారి డైరెక్షన్ లో నిర్మితమయిన “కంచె” సినిమా షూటింగ్ కోసం జార్జియా దేశం వెళ్లారు సాయి మాధవ్, అక్కడ షూటింగ్ లొకేషన్ లో ఒక టెంట్లో కూర్చుని ఏదో రాసుకుంటున్నారు. బయట వార్ సీన్స్ షూట్ చేస్తున్నారు క్రిష్ గారు. షూటింగ్ జరుగుతుండగా కొంత మంది కోలాహలం గ అరవటం వినిపించి వారి వైపు చూసారు , వార్ సీన్ కదా దానిలో భాగంగా ఏదో అరుస్తున్నారు అనుకున్నారు సాయి మాధవ్,
కానీ వారంతా ఏదో సైగలు చేస్తూ పెద్దగా అరవటం గమనించారు, వారు ఏమి చెబుతున్నారో సాయి మాధవ్ కు అర్ధం కాలేదు. ఇంతలో సైగలు చేస్తూ కిందకు చూడు, అంటున్నారు అప్పుడు కిందకు చూసిన సాయి మాధవ్ కి గుండె ఆగినంత పని అయింది. అయన కూర్చున్న కుర్చీ కింద బాంబు ఆరెంజ్ చేసి ఉంది. వార్ సీన్ కదా అక్కడ ఉన్న టెంట్ పేలిపోయినట్లు చూపించటానికి ఎక్సప్లోజివ్స్ టీం వాళ్ళు అది ఆరెంజ్ చేసి ఉన్నారు. అది తెలియని సాయి మాధవ్ ఖాళీ గ ఉన్న టెంట్లో బాంబు మీద కుర్చీ వేసుకొని కూర్చొని ప్రశాంతంగా రాసుకుంటున్నారు. సీన్ షూట్ చేస్తున్న క్రమంలో ఎక్సప్లోజివ్స్ టీం వాళ్ళు సాయి మాధవ్ గారిని గమనించి అప్రమత్తం చేయకుంటే కంటిన్యూటీ లో బాంబు పేలి ఉండేది. అదృష్టం బాగుండి వారు చూడటం తో వారు వార్న్ చేయటం తో కంగారుపడిన సాయి మాధవ్ గారు తన బాగ్, పేపర్స్ తీసుకొని బయటకి రావటం తో పెద్ద ప్రమాదం తప్పింది.