in

Bollywood Superstar sanjay dutt in Akhanda2?

బాల‌కృష్ణ కెరీర్‌ లో అఖండ ది బెస్ట్ గా నిలిచింది. బాలయ్య కెరియర్ టర్నింగ్ పాయింట్ కూడా ఈ మూవీనే. అఖండ మూవీ తరవాత బాలయ్య వరుస హిట్స్ అందుకున్నారు. బోయ‌పాటి కి కూడా ఆ తరవాత సరైన హిట్ లేదు. మళ్ళీ అఖండ 2తో క‌మ్ బ్యాక్ ఇవ్వాలని హార్డ్ వర్క్ చేస్తున్నారు. మొదటి సినిమాలో కనిపించే పాత్రలన్నీపార్ట్ 2 లో కూడా రిపీట్ అవుతున్నాయి. అదనంగా ఇంకొన్ని కొత్త పాత్రలు యాడ్ అవుతున్నాయి. హీరోయిన్ సంయుక్త మీన‌న్, ఆది పినిశెట్టి అఖండ 2 లో నటిస్తున్నారు..

లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఈ మూవీలో బాలీవుడ్  స్టార్ సంజ‌య్ ద‌త్ కూడా నటిస్తున్నట్లు సమాచారం. సంజయ్ ఈ మధ్య సౌత్ లో విలన్ గా వరుస ఆఫర్స్ అందుకుంటున్నాడు. ఇప్పటికే ‘డబుల్ ఇస్మార్ట్’ లో సంజ‌య్‌ద‌త్ విల‌న్‌గా న‌టించాడు. ఇప్పుడు బోయపాటి మూవీలో ఆఫర్ వచ్చింది. బోయపాటి సినిమాల్లో విలన్ పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుంది. హీరోకి ధీటుగా విలన్ పాత్ర డిజైన్ చేస్తారు బోయపాటి. సంజయ్ లో ఉన్న నటుడ్ని బోయపాటి కరక్ట్ గా ఎలివేట్ చేస్తూ హైలెట్ చేస్తాడు. పైగా బాల‌య్య విలన్ గా సంజ‌య్ ద‌త్ అంటే పర్ఫెక్ట్ గా ఉంటుంది..!!

Colors Swathi back to Tollywood with Nikhil’s Swayambhu!