in

bollywood star Vivek Oberoi unveiled as Spirit villain!

ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘స్పిరిట్’ నుంచి మేకర్స్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమాలో విలన్‌గా బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ నటిస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించి, తాజాగా ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో వివేక్ ఒబెరాయ్ పవర్‌ఫుల్ లుక్‌లో కనిపించాడు. అయితే, ఈ అప్డేట్‌తో ప్రభాస్ ఫ్యాన్స్ కాస్త డిజప్పాయింట్ అయ్యారని చెప్పాలి. ‘స్పిరిట్’ చిత్రాన్ని పవర్‌ఫుల్ యాక్షన్ థ్రిల్లర్‌గా దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తెరకెక్కిస్తున్నాడు..

కాగా, ఈ సినిమాలో కొరియన్ నటుడు డాన్ లీ పవర్‌ఫుల్ విలన్ పాత్రలో నటిస్తాడనే వార్తలు గతంలో వైరల్ అయ్యాయి..దీంతో ప్రభాస్‌తో డాన్ లీ యాక్షన్ సీక్వెన్స్‌లు చూడాలని అభిమానులు ఆశించారు. కానీ, ఇప్పుడు ఈ సినిమాలో విలన్ వివేక్ ఒబెరాయ్ అని మేకర్స్ తేల్చి చెప్పడంతో డాన్ లీ ఈ సినిమాలో నటించడం లేదని క్లారిటీ వచ్చేసింది. దీంతో ప్రభాస్ అభిమానులు ఆశించిన కాంబో లేదని నిరాశకు లోనవుతున్నారు. అయినా, సందీప్ రెడ్డి వంగ తన చిత్రాలలో విలన్‌ను పవర్‌ఫుల్‌గా చూపెడతాడని..మరి స్పిరిట్ చిత్రంలో వివేక్ ఒబెరాయ్‌ను ఆయన ఎలా చూపెడతారో వేచి చూడాలని వారు కామెంట్స్ చేస్తున్నారు..!!

lady superstar nayanthara’s Caravan and On-Set Requirements!

Devi Sri Prasad’s Remuneration Shocks Tollywood!