శ్రీరాముడిగా రణబీర్ కపూర్, సీతాదేవిగా సాయి పల్లవి నటిస్తున్నారు. అయితే, ఈ సినిమాకు సంబంధించి సాయి పల్లవి పారితోషికంపై ప్రస్తుతం ఓ ఆసక్తికరమైన వార్త బీ-టౌన్‌లో చక్కర్లు కొడుతూ, తీవ్ర చర్చకు దారితీసింది. ఈ ‘రామాయణ’ కోసం సాయి పల్లవి ఏకంగా రూ. 13 కోట్ల పారితోషికం డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే, భారతీయ చిత్ర పరిశ్రమలో ఒక నాయిక ఇంత భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ అందుకోవడం ఇదే ప్రథమం అవుతుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఈ ప్రతిష్ఠాత్మక చిత్రంలో రావణాసురుడి పాత్రలో శాండల్‌వుడ్ స్టార్ యష్ కనిపించనుండగా, సన్నీ డియోల్, రకుల్ ప్రీత్ సింగ్, లారా దత్తా వంటి వారు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారని సమాచారం. సీత పాత్రకు దక్షిణాది నటి సాయి పల్లవిని ఎంపిక చేయడంపై కొందరు బాలీవుడ్ నటీమణులు అసంతృప్తి వ్యక్తం చేశారని, “బాలీవుడ్‌లో నటీమణులే కరవయ్యారా? పొరుగు రాష్ట్ర నటిని ఎందుకు తీసుకోవాలి?” అని మండిపడ్డారని అప్పట్లో వార్తలు గుప్పుమన్నాయి..!!