టాలీవుడ్ లోకి మరో విదేశీ భామ అడుగు పెట్టబోతోంది. ఇప్పటికే ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలో ఒలీవియా మోరిస్ మెరిసిన సంగతి తెలిసిందే. తాజాగా బ్రెజిల్ అందాల భామ జెన్నిఫర్ పిచినెటో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తోంది. సత్యదేవ్ 26వ చిత్రంగా తెరకెక్కుతున్న సినిమాలో ఈమె నటించబోతోంది. ఈ చిత్రంలో డాలీ ధనుంజయ కీలక పాత్రను పోషిస్తున్నారు. ఈ సినిమాలో మరో హీరోయిన్ గా ప్రియా భవానీ శంకర్ ను తీసుకున్నారు. ఇక క్రైమ్ యాక్షన్ ఎంటర్టయినర్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కొనసాగుతోంది. బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ తాజా చిత్రం ‘రామ్ సేతు’లో ముఖ్య పాత్రను పోషించిన జెన్నిఫర్ ప్రేక్షకుల ఆదరణను సొంతం చేసుకుంది. బ్రెజిలియన్ మోడల్ గా జెన్నిఫర్ కు మంచి ఫాలోయింగ్ ఉంది. మరి తెలుగు ప్రేక్షకులను ఈ భామ ఎంత వరకు మెప్పిస్తుందో వేచి చూడాలి..!!