in

bollywood beauty Vidya Balan Not Part of Akhanda 2!

ప్రస్తుతం బోయపాటి శ్రీను డైరెక్షన్లో ఈ సినిమా షూట్ సరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సినిమాకు సంబంధించిన రోజుకు అప్డేట్ నెట్టింట వైరల్ గా మారుతుంది. ఇక గతంలో బాలకృష్ణ..ఎన్టీఆర్ బయోపిక్ నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బాలయ్యతో కలిసి.. విద్యాబాలన్ ఆకట్టుకుంది. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా బాగా వర్కౌట్ అయింది.

ఈ క్రమంలోనే తాజాగా అఖండ 2లో విద్యాబాలన్ ఓ కీలక పాత్రలో కనిపించబోతుంది అంటూ టాక్ తెగ వైరల్ గా మారింది..తాజాగా ఈ వార్తలపై విద్యాబాలన్ టీం స్పందించారు. ఈ సినిమాలో విద్యాబాలన్ నటించడం లేద‌ని.. ఆమెకు అఖండ 2 తో ఎలాంటి సంబంధం లేదంటూ క్లారిటీ ఇచ్చారు. దీంతో విద్యాబాలన్ అఖండ 2లో నటిస్తుందని వ‌స్తున్న వార్తలు అవాస్తవమని తెలిసిపోయింది. ఇక అఖండ 2లో గోల్డెన్ బ్యూటీ సంయుక్త మీనన్ కీలకపాత్రలో మెరుస్తున్న సంగతి తెలిసిందే..!!

Allu Arjun to play a dual role atlee’s movie?