పాన్ ఇండియా స్టార్ ఎన్టీఆర్, సంచలన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే మూవీ షూటింగ్ కొంతవరకు జరిగింది. మొన్నటిదాకా కర్ణాటకలో షూటింగ్ చేసిన టీం.. ఓ భారీ షెడ్యూల్ ను కంప్లీట్ చేసింది. ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరు నటిస్తారనే దానిపై రకరకాల రూమర్లు వినిపిస్తున్నాయి. ఇప్పటికే రుక్మిణి వసంత్ పేరు ఖరారు అయినట్టు వార్తలు వస్తున్నా..దాన్ని మూవీ టీమ్ కన్ఫామ్ చేయాల్సి ఉంది. అయితే ఇప్పుడు మరో హీరోయిన్ ఇందులో నటిస్తున్నట్టు తెలుస్తోంది..
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ ఈ సినిమాలో నటిస్తున్నట్టు సమాచారం అందుతోంది. ఈ మూవీస్ సెకండ్ హాఫ్ లో ఓ కీలక పాత్ర కోసం శ్రద్ధా కపూర్ ను తీసుకోవాలని ప్రశాంత్ నీల్ భావిస్తున్నాడంట. ఇప్పటికే ఆమెకు కథ చెప్పగా సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ఆమెతో మరోసారి చర్చలు జరుపనున్నారంట. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రాబోతోంది. శ్రద్ధా కపూర్ అంతకుముందు సాహో మూవీలో కూడా మెరిసింది. అప్పటినుండే సౌత్ లో ఆమెకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది..!!