RRR తరువాత రామ్ చరణ్ గేమ్ చేంజెర్ మూవీతో ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు. నెక్స్ట్ RC16 అనే వర్కింగ్ టైటిల్ తో బుచ్చి బాబుతో ఒక ప్రాజెక్ట్ కి వర్క్ చేస్తున్నాడు. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే మైసూర్ లో 15 రోజుల షెడ్యుల్ పూర్తి చేసుకుంది. సల్మాన్ ఖాన్ కీలక పాత్రల్లో కనిపిస్తారని టాక్..
ఇప్పడు మరొక బాలీవుడ్ స్టార్ హీరోయిన్ RC16 లో భాగం అవుతోంది అని టాక్..ఈ మూవీలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర కోసం బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కాజోల్ ని సంప్రదించినట్లు సమాచారం. కాజోల్ హీరోయిన్ గా ఫుల్ ఫామ్ లో ఉన్నప్పుడు కోలీవుడ్ లో మెరుపుకలలు సినిమాలో నటించింది. నెక్స్ట్ ధనుష్ ‘VIP 2 ‘ లో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి మెప్పించింది. కాజోల్ కెరియర్ లో సౌత్ లో ఈ రెండు సినిమాల్లో మాత్రమే నటించింది. మళ్ళీ ఇన్నాళ్ళకి సౌత్ నుంచి కాజోల్ కి ఆఫర్ వచ్చింది..!!