విద్య బాలన్ “బోల్డ్ గర్ల్ అఫ్ బాలీవుడ్”,….. “ఐరన్ లెగ్ “అఫ్ సౌత్ ఇండియన్ మూవీస్. ఇదేమిటి ఇక్కడ ఐరన్ లెగ్ అక్కడ బోల్డ్ గర్ల్ ఎలా అయ్యింది అనుకోకండి,” ఓన్లీ సక్సెస్ స్పీక్స్ “, చలన చిత్ర రంగం లో, నటనలో నువ్వెంత తోపు అయినా, మీ విజయమే మీకు కొలమానం, విజయం వరించకపోతే ఎవరినైనా ఐరన్ లెగ్, మసిగాడు అనే అంటాము అంటారు సినీ పండితులు నిర్మొహమాటంగా. విద్య బాలన్ హిందీ చిత్ర రంగ ప్రవేశం చేయక ముందు మల్లు వుడ్ నుంచి పిలుపు వచ్చింది, “చక్రం” అనే సినిమాలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ సరసన నటించే అరుదైన అవకాశం వచ్చింది, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తో సినిమా ఆగి పోయింది..
ఆ తరువాత ఆమె స్థానం లో వేరే హీరోయిన్ ను తీసుకున్న, ఆ సినిమా పూర్తి కాకుండానే అటకెక్కిసింది..ఆ తరువాత లింగుస్వామి డైరెక్షన్ లో నిర్మాణం అవుతున్న ” రన్” అనే తమిళ చిత్రం లో హీరోయిన్ గ సెలెక్ట్ అయింది, కానీ విద్య బాలన్ ను తీసేసి మీరా జాస్మిన్ ని తీసుకున్నారు, దీని తరువాత “మనసెల్లామ్” అనే చిత్రం లో కూడా విద్య బాలన్ స్థానం లో త్రిషను తీసుకున్నారు.వీటన్నిటి తరువాత “కలరి విక్రమన్” అనే మలయాళ చిత్రం పూర్తి అయినా ఇప్పటివరకు విడుదలకు నోచుకోలేదు.
ఇలా విద్య బాలన్ సైన్ చేసిన పన్నెండు సినిమాలు వివిధ కారణాల వలన అటకెక్కడం తో ఈమె ముంబై ఫ్లైట్ ఎక్కేసింది. తనను బాల నటిగా అక్కున చేర్చుకున్న బాలి వుడ్ లోనే తన ఫ్యూచర్ వెదుక్కుంది,బాలి వుడ్ లో క్రేజీ హీరోయిన్ గ సెటిల్ అయిన చాలా కాలానికి మలయాళం లో ” ఉర్మి” అనే చిత్రంలో నటించింది, దాని తరువాత యెన్.టి.ఆర్. బయోపిక్ లో యెన్.టి.ఆర్ ధర్మ పత్ని బసవ తారకం గారి రోల్ చేసింది. అయినప్పటికీ సౌత్ ఇండియన్ సిల్వర్ స్క్రీన్ ఆమెకు ఇచ్చిన” ఐరన్ లెగ్” టాగ్ తొలగిపోలేదు. కొన్ని విషయాలు మన ప్రమేయం లేకుండా అలా జరిగి పోతుంటాయి అదంతే.