in

black beauty amala paul shocks ‘ghost’ makers!

సినిమాలతో పాటు కాంట్రవర్సీలతోరూ నిత్యం సావాసం చేసే వారిలో కోలీవుడ్‌ నటి అమలా పాల్‌ ఒకరు. తన మనసులో భావాలను ఎలాంటి ఫిల్టర్‌ లేకుండా చెప్పే అమలా నిత్యం ఏదో ఒక అంశంతో వార్తల్లో నిలుస్తుంటారు. మారుతోన్న కాలానికి అనుగుణంగా వెబ్‌ సిరీస్‌ల్లోనూ నటించి డిజిటల్ ప్రేక్షకులను అలరించిన ఈ చిన్నది. ఇటీవల ఆహా వేదికగా విడుదలైన ‘కుడి ఎడమైతే’ వెబ్‌ సిరీస్‌తో నటనతో మరోసారి ప్రేక్షకులను మెస్మరైజ్‌ చేసిందీ బ్యూటీ. నిత్యం కాంట్రవర్సీలతో సావాసం చేసే అమలా పాల్‌ మరోసారి వార్తల్లొకెక్కారు.

అయితే ఈసారి అమలా తన రెమ్యునరేషన్‌ విషయంలో వార్తల్లో నిలిచారు..భారీగా రెమ్యునరేషన్‌ పెంచేసిన అమలా పాల్‌ నిర్మాతలకు షాక్‌ ఇస్తోందని సమాచారం. ఈ క్రమంలోనే తాజాగా అమలాపాల్‌ తెలుగులో ఓ భారీ చిత్రాన్ని రెమ్యునరేషన్‌ కారణంగా వదులుకుందన్న వార్త నెట్టింట వైరల్‌ అవుతోంది. ఇంతకీ విషయమేంటటే నాగార్జున హీరోగా, ప్రవీణ్ సత్తార్‌ దర్శకత్వంలో ‘ఘోస్ట్‌’ అనే సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. తొలుత ఈ సినిమాలో నాగార్జున సరసన, కాజల్‌ నటించనున్నట్లు వార్తలు వచ్చాయి.

అయితే కాజల్‌ తల్లి కాబోతుండడంతో సినిమా సెట్స్‌పైకి వెళ్లకముందే కాజల్‌ సినిమా నుంచి తప్పుకున్నారు..దీంతో చిత్ర యూనిట్‌ హీరోయిన్‌ పాత్ర కోసం అమలాపాల్‌ అయితే బాగుంటుందని భావించి ఆమెను అప్రోప్‌ అయ్యారని సమాచారం. కానీ ఈ సినిమాలో నటించడానికి అమలా పాల్‌ భారీగా డిమాండ్ చేయడంతో మేకర్స్‌ వెనకడుగు వేశారని సమాచారం. అమలా అడిగినంత రెమ్యునరేష్‌ ఇవ్వలేమని తేల్చి చెప్పారంటా. దీంతో అమలా నాగ్‌ సినిమాలో నటించేందుకు నో చెప్పిందనే చర్చ జరుగుతోంది.

vakeel saab beauty Ananya Nagalla debuts in Kollywood!

Gangubai’s Family Slams Alia Bhatt, Says ‘She Was Not a Prostitute’!