in

BJP files a complaint against singer Mangli!

జులై 11న మంగ్లీ అఫీషియల్‌ యూట్యూబ్‌ ఛానెల్‌ లో ఈ ఏడాది బోనాల సాంగ్‌ రిలీజ్‌ చేసిన సంగతి తెలిసిందే. అయితే… ఈ పాటపై గత మూడు రోజులుగా సోషల్‌ మీడియా పెద్ద జరుగుతోంది. ”చెట్టు కింద కూసున్నవమ్మా… సుట్టం లెక్క ఓ మైసమ్మా” అంటూ సాగే ఈ పాటపై తెలంగాణకు చెందిన పలువురు అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ దుమారం లేపారు. బోనాల పాటలో అమ్మవారి పై తప్పుడు పదాలు ఉపయోగించారని సింగర్‌ మంగ్లీపై మండిపడుతున్నారు. ఇక బీజేపీ పార్టీ కార్యకర్తలైతే.. ఏకంగా కేసు పెట్టేశారు. అయితే.. ఈ వివాదంపై మంగ్లీ క్లారిటీ ఇచ్చారు.

ఈ పాటలో ఎలాంటి వివాదస్పద పదాలను వాడలేదంటూ తన సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్‌ ద్వారా పేర్కొన్నారు మంగ్లీ..ఈ పాటను ప్రఖ్యాత జానపద పాటల రచయిత పాలమూరు రామస్వామి 25 ఏళ్ళ క్రితమే రచించారని పేర్కొన్న మంగ్లీ…. పాలమూరు ప్రాంతంలో కోలాటంలో ఈ పాట చాలా ప్రసిద్ది అని తెలిపారు. 2008లో ఈ పాటను DRC ఆడియో సంస్థవారు సిడీ రూపంలో కూడా విడుదల చేశారని… ఆ పెద్దాయన రాసిన జానపదాలు తనకు చాలా ఇష్టం అని వెల్లడించారు. ఆయన మీద అభిమానంతో స్వయాన ఆయన్ని కలిసి ఈ పాటను తీసుకున్నామని… ఈ పాట వీడియోలో రామస్వామిగారిని కూడా చిత్రీకరించామని చెప్పుకొచ్చింది మంగ్లీ.

Rajinikanth proved again that his craze is unmatchable in Japan!

Rashmi Gautam Sizzles In Black Saree!