ఒక్క సినిమా హిట్ అయినా కూడా యువ దర్శకులు ఇండస్ట్రీ లో మంచి పేరు తెచ్చేసుకుంటున్నారు. తాజాగా ఈ మధ్య కాలంలో బాగా వినిపిస్తున్న డైరెక్టర్ పేరు మల్లిడి వశిష్ట. కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన “బింబిసార” సినిమాకి దర్శకత్వం వహించిన వశిష్ట మొదటి సినిమాతోనే మంచి హిట్ ను అందుకున్న సంగతి తెలిసిందే. తక్కువ బడ్జెట్ తో భారీ విజువల్ ఎఫెక్ట్స్ ఉన్న ఒక మంచి సోషియో ఫాంటసీ సినిమాని అద్భుతంగా తెరకెక్కించి వశిష్ట అందరికీ షాక్ ఇచ్చారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఈ నేపథ్యంలో ప్రముఖ నిర్మాతలు కూడా మల్లిడి విశిష్ట వెనక పడ్డట్టు తెలుస్తోంది.
అయితే తాజాగా ఇప్పుడు మల్లిడి వశిష్ట ఏకంగా సూపర్ స్టార్ రజినీకాంత్ తో ఒక సినిమా చేయబోతున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే, ఈ మధ్యనే రజినీకాంత్ ను కలిసిన మల్లిడి వశిష్ట ఒక మంచి కథ ను వినిపించారట. రజినీకాంత్ కు కథ బాగానే నచ్చింది కానీ ఇంకా గ్రీన్ సిగ్నల్ మాత్రం ఇవ్వాల్సి ఉందట. ఒకవేళ అన్నీ అనుకున్నట్లు జరిగితే రెండవ సినిమా కే రజినీకాంత్ కి దర్శకత్వం వహించడం అంటే చాలా గొప్ప విషయం అని చెప్పాలి. కొత్త డైరెక్టర్ అయినప్పటికీ మల్లిడి వశిష్ట “బింబిశార” సినిమాను చాలా బాగా హ్యాండిల్ చేశారు. రజినీకాంత్ వంటి సూపర్ స్టార్ ను కూడా మల్లిడి వశిష్ట బాగా హ్యాండిల్ చేయగలరు అని సమాచారం..!!