
ఒక ఇంటర్వ్యూలో అరియానా తన జీవితంలో చేసిన ఒక ఉద్యోగం గురించి మాట్లాడుతూ అందరినీ ఆశ్చర్యపరిచింది. “ఆ సమయంలో నాకు నేను చేస్తున్న ఉద్యోగం వల్ల.. నెలకు కేవలం 1800 రూపాయలే జీతం వచ్చేది. కానీ నా ఇంటి అద్దె మాత్రం 3000 రూపాయలు. అద్దె కట్టడానికి డబ్బులు దాచుకుంటే, ఒకసారి అవి కూడా దొంగతనం అయ్యాయి. ఆ రోజు చాలా ఇబ్బంది పడ్డాను” అని ఆమె భావోద్వేగంగా చెప్పింది..
డబ్బుల అవసరం ఎక్కువగా ఉండటంతో ఒకేసారి ఐదు..ఆరు పనులు కూడా చేసిన సందర్భాలు ఉన్నాయని తెలిపింది. అప్పుడు తను ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు పడిందో ఈ ఇంటర్వ్యూ ద్వారా తెలియజేసింది. అరియానా అసలు పేరు ఆర్చనా అని..తరువాత తన పేరును తల్లిదండ్రులు మార్చారని కూడా ఈ ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఎందుకు మార్చారో తనకూ తెలియదని..కానీ ఇప్పుడు అరియానా అనే పేరుతో సంతోషంగా ఉన్నానని చెప్పింది. తన కెరీర్ విషయానికి వస్తే, ఈ రంగంలోకి రావడం అనుకోకుండా జరిగిందని తెలిపింది. ఒక రోజు టీవీలో యాంకర్ల కోసం వచ్చిన ప్రకటన చూసి ఆడిషన్‌కు వెళ్లానని..అదృష్టవశాత్తు ఎంపికయ్యానని చెప్పింది..!!