బిగ్‌బాస్ షో స్టార్ట్ అయిన మొదటి వారంలోనే లహరి అందరిపై అరుస్తూ.. గట్టిగా మాట్లాడుతూ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేసింది. అయితే.. అది ఆమెకు బెడిసి కొట్టింది. హౌజ్ లో ముక్కుసూటిగా ఉంటుంది అనిపించుకునే ప్రయత్నంలో ప్రేక్షకులను మెప్పించడంలో ఓడిపోయింది. మొదట్లో అందరూ మెచ్చుకున్నప్పటికీ అదే తీరును కంటిన్యూ చేయడం.. చిన్న చిన్న విషయాలకు కూడా కయ్యానికి కాలు దువ్వడంతో ఆమెను మెచ్చుకున్న వాళ్లే నొచ్చుకోవడంతో ఇంటి నుంచి బయటకు రాక తప్పలేదు.
బిగ్ బాస్ హౌజ్ లోని కంటెస్టెంట్ లలో అందరి కంటే మానస్ తో లహరి కాస్త దగ్గరైంది. ఇది నచ్చని ప్రియా, ప్రియాంక, సిరి తమ గేమ్ ప్లాన్ అమలు చేశారు. హౌస్‌లో ఉన్నవాళ్లతో పాటు బయటకు వచ్చిన ఉమాదేవి కూడా లహరి గురించి బిగ్ బాస్ స్టేజీ మీద నాగార్జున ముందు ఓపెన్ మాట్లాడింది. లహరి ఓటింగ్ మీద ఉమాదేవి మాటలు బలంగా పనిచేశాయి. అంతే కాదు.. నామినేషన్స్‌లో ఉన్న వారిలో తక్కువ పాపులారిటీ, తక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నది లహరికి మాత్రమే. దీంతో ఓటింగ్ శాతంలో వెనుకబడి.. ఎలిమినేషన్ కాక తప్పలేదు.