in

Big Mistake: Nagarjuna Preferred Coolie Over Dhurandhar

బాలీవుడ్ లో విడుద‌లైన ‘దురంధ‌ర్‌’ దుమ్ము దులిపేసింది. రూ.1000 కోట్ల‌కు పైగానే ఈ సినిమా వ‌సూళ్లు అందుకొంది. ఇప్పుడు ఓటీటీలోనూ విడుద‌లైంది. థియేట‌ర్లో చూడ‌ని వాళ్లు సైతం..ఇప్పుడు ఓటీటీలో చూసి ‘మంచి సినిమా’ అంటూ మెచ్చుకొంటున్నారు. ఈ సినిమాలోని న‌టీన‌టులంద‌రికీ మంచి పేరు వ‌చ్చింది. ముఖ్యంగా అక్ష‌య్ ఖ‌న్నా చేసిన రెహ‌మాన్ డెకాయిట్ పాత్ర అయితే బ్లాస్ట్ లా పేలింది..

రెహ‌మాన్ గా అక్ష‌య్ ఆహార్యం, అభిన‌యం బాగా న‌చ్చాయి. నిజానికి ఈ పాత్ర కోసం ముందుగా నాగార్జున‌ను సంప్ర‌దించిన‌ట్టు స‌మాచారం. అయితే నాగ్ ఒప్పుకోలేదు. ఆ స్థానంలో ‘కూలీ’ సినిమాను ఒప్పుకొన్నారు. ‘కూలీ’ ఇచ్చిన రిజ‌ల్ట్ ఎలాంటిదో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ‘దురంధ‌ర్‌’ విడుద‌ల‌య్యాక‌.. నాగ్ నిర్ణ‌యం ఎంత త‌ప్ప‌య్యిందో తెలిసొచ్చింది. నాగ్సినిమాని వదిలేసి త‌ప్పు చేశాడ‌ని ఆయ‌న అభిమానులు కూడా బాధ ప‌డుతున్నారు..!!

Mrunal Thakur reacts about working with Allu Arjun!

Meenakshi Chaudhary refutes stress, depression rumours!