బాలయ్య బాబు, ఎంతటి భోళా మనిషి అని చెప్పటానికి తెలుగు సినీ పరిశ్రమలో, చాల ఉదాహరణలు ఉన్నాయి, అటువంటి ఒక సంఘటన గురించి ఇక్కడ ప్రస్తావించటం అవసరం. మాస్ హీరో గ దూసుకొని పోతున్న బాలయ్య బాబు 1994 లో భైరవ ద్వీపం అనే జానపద చిత్రం లో నటించారు, నాగిరెడ్డి గారి తనయుడు వెంకట్రామి రెడ్డి చందమామ విజయ ప్రొడక్షన్స్ బ్యానర్ పేరు మీద నిర్మించిన చిత్రం. కంప్యూటర్లు, గ్రాఫిక్కులు లేని రోజుల్లో సింగీతం శ్రీనివాస రావు గారు సృష్టించిన విసువల్ వండర్ భైరవ ద్వీపం. ఆ చిత్ర నిర్మాణానినికి చాల భారీ బడ్జెట్ అయ్యింది, రిలీజ్ కి ముందే అందరి కి ఇవ్వవలసిన పారితోషికాలు ఇచ్చాకే సినిమా రిలీజ్ చేయవలసి ఉంటుంది.
అటువంటి సందర్భం లో బాలయ్య బాబు కి ఇవ్వవలసిన పారితోషికం తాలూకు ఆరు లక్షలు రిలీజ్ తరువాత ఇస్తాము అని అడగటానికి, ఆ చిత్రానికి కథ సమకూర్చటమే కాక నిర్వహణ కూడా చూసిన, సీనియర్ నటుడు రావికొండల రావు గారు బాలయ్య వద్దకు వెళ్లి విషయం చెప్పగానే, వెంటనే మరో ఆలోచన లేకుండా, సూటిగా సుత్తి లేకుండా , బాలయ్య బాబు ఏమన్నారో తెలుసా ? ఎందుకండీ సినిమా చాల ఖర్చు పెట్టి చాల బాగా తీశారు, నాకు ఇవ్వవలసిన, ఆరు లక్షలు ఇవ్వ అవసరం లేదు అని చెప్పండి, వెంకట్రామి రెడ్డి గారికి అని ఒక్క మాటలో తేల్చేశారట. ఆ రోజుల్లో ఆరు లక్షలు అంటే చాలా పెద్ద మొత్తమే అయినా బాలయ్య అది పెద్ద విషయం కాదు అన్నట్లు చాల తేలికగా తీసుకున్నారు. అదే ఆయన భోళా తనం, అందుకే ఆయన నిర్మాతల హీరో, డైరెక్టర్ మాటకు ఎదురు చెప్పని ఒక నిబద్ధత కలిగిన హీరో అంటారు తెలుగు సినీ పరిశ్రమలో..