
తనికెళ్ళ భరణి గారు తన కెరీర్ ప్రారంభ దశ లో ఒక విచిత్రమయిన అనుభవాన్ని ఎదుర్కోవలసి వచ్చింది. సీనియర్ రైటర్ సత్యమూర్తి గారి పేరు వింటే వెన్నులోంచి వణుకు పుట్టేది, సత్యమూర్తి గారికి కనిపించకుండా సంవత్సరం పాటు తప్పించుకు తిరిగారు భరణి గారు. భరణి గారు అంతగా భయపడటానికి కారణం ఏమిటి, ఎందుకు సత్యమూర్తి గారి కంటపడకుండా తిరిగారు, తెలుసుకుంటే చాల ఆశ్చర్యంగా ఉంటుంది. రవిరాజా పినిశెట్టి గారి డైరెక్షన్ లో సూపర్ హిట్ అయిన” కోనసీమ కుర్రోడు” అనే మూవీ కి డైలాగ్స్ రాసారు భరణి గారు, చాల మంచి పేరు వచ్చింది, దానితోపాటు ఒక కొత్త భయం భరణి గారిని వెంటాడటం మొదలెట్టింది. ఈ సినిమా కు మొదట సత్యమూర్తి గారు రైటర్, అప్పుడు వారి హెల్త్ బాగోలేని కారణంగా భరణి గారు డైలాగ్స్ వ్రాసారు, ఈ విషయం తరువాత తెలిసింది భరణి గారికి, అంతే అప్పటినుంచి సత్యమూర్తి ఫోబియా మొదలయింది. ఒక సందర్భం లో సత్యమూర్తి గారి నుంచి ఫోన్ వస్తే, మాట్లాడకుండా తప్పించుకున్నారు భరణి, ఒక సభకు వెళితే వేదిక మీద ఆయనను చూసి సభనుంచి వచ్చేసారు. ఇలా కాలం గడుస్తుంది, భరణి గారు” నారి నారి నడుమ మురారి” చిత్రం లో ఒక వేషం వేయడానికి సెట్ కి వెళ్లారు, వెళ్ళాక తెలిసింది ఆ మూవీ కి రైటర్ సత్యమూర్తి గారని, ఇక టెన్షన్ భరించలేని భరణి గారు, ఆయన గదిలోకి వెళ్లి సత్యమూర్తి గారి కాళ్ళు పట్టేసుకున్నారు. సత్యమూర్తి గారు, భరణి ఏమిటిది, నువ్వా ఆ సినిమా చాల బాగా వ్రాసావు అని చెబుదామని వంద సార్లు ట్రై చేశా, నువ్వు ఫోన్ అటెండ్ చేయలేదు అని అన్నారట. సత్యమూర్తి గారు వ్రాయవలసిన సినిమా వారి పర్మిషన్ లేకుండా నేను వ్రాసాను అనే అపరాధ భావన, భరణి గారిని వెంటాడింది ఇన్ని రోజులు. సత్యమూర్తి గారు అదేమీ మనసులో పెట్టుకోకుండా, మెచ్చుకొవటం విన్న తరువాత గాని ఆయన మనసులోని ఆ అపరాధ భావం పోలేదు భరణి గారికి. ఒక ఏడాది వెంటాడిన భయం ఎగిరిపోయింది, మనసు కుదుట పడింది.

